అందుకే బాలయ్యతో చేసిన అఖండ 2 సినిమాని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేశారు. కానీ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అఖండ 2 చిత్రంతో నార్తులో తన మార్క్ చాటుకోవాలని చూసిన బోయపాటికి ఈసారి ఎదురు దెబ్బ తగిలింది. అయినా సరే తన ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోకుండా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. తన మాస్ ప్రయత్నాన్ని బాలీవుడ్ హీరోతో ఈసారి కలిసి ప్రయత్నించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల దురంధర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రణవిర్ సింగ్ తో బోయపాటి తన తదుపరి సినిమా కోసం చర్చలు జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రణవీర్ సింగ్ కు సినిమా స్టోరీ కూడా నచ్చి ఓకే చెబితే బోయపాటి కెరీర్ కి ఇది బాగా కలిసొస్తుందని చెప్పవచ్చు. అన్ని అనుకూలిస్తే బోయపాటి విధ్వంసం బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతుందనే విధంగా నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి. గతంలో కూడా ఎన్నోసార్లు రణవీర్ సింగ్ సౌత్ డైరెక్టర్లతో పని చేయాలని తాను ఎదురుచూస్తున్నానని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి బోయపాటి సినిమాకి ఓకే చెబుతారో లేదో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి