స్టోరీ విషయానికి వస్తే:
శాంతి (ఈషా రెబ్బా) ను చిన్న వయసు నుంచే చాలా జాగ్రత్తగా , పరిమితులతో తల్లిదండ్రు పెంచుతూ ఉంటారు. దీంత తాను చేయాలనుకున్నది ఏదీ కూడా చేయలేకపోతుంది. కాలేజీలో ఒకరిని ప్రేమించిందని తెలియడంతో వెంటనే సంబంధం చూసి తల్లితండ్రులు ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) కి ఇచ్చి వివాహం చేస్తారు. రాజమండ్రిలో చేపల బిజినెస్ చేస్తున్న ఓంకార్ నాయుడు తన మాటే వినాలి, తనకు నచ్చినట్టు జరగాలనే అహంకారంతో జీవిస్తుంటారు. దీంతో తన భార్య చేసే పనులు ఓంకార్ నాయుడుకి పెద్దగా నచ్చవు దీంతో ఒకరోజు శాంతి మీద చేయి చేసుకుంటారు. ఆ తర్వాత సారి చెప్పి కూల్ చేసి, అలా ప్రతిరోజు కొట్టడం జరుగుతుంది. ఈ విషయాన్ని శాంతి ఇంట్లో వాళ్లకు చెప్పిన సర్దుకుపోవాలని చెబుతూ ఉండడంతో ఏం చేయాలో తెలియక ఆన్లైన్లో కరాటే నేర్చుకొని మరి తన భర్తను కొడుతుంది. దీంతో రెండు కుటుంబాలు పంచాయతీ పెట్టగా, ఆ తర్వాత ఓంకార్ నాయుడు మారతాడా? శాంతి భర్తతో హ్యాపీగా ఉందా? శాంతి చేయాలనుకున్నదేంది? అనే విషయం తెలియాలి అంటే వెండి తెరపై చూడాల్సిందే.
సినీ విశ్లేషణ:
మలయాళ ఇండస్ట్రీలో జయ జయ జయ జయహే సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తెలుగులో కూడా ఓటిటిలో బాగానే సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రీమేక్ సినిమాలే అవసరం లేని సమయంలో ఇలాంటి సినిమా చేయడం గమనార్హం. ప్రమోషన్స్ లో ఆ సినిమా వేరుగా ఉంటుంది. ఈ సినిమా చూసి అందరూ నవ్వుకుంటారు అంటూ చిత్రబృందం చెప్పుకొచ్చారు. ఇక మొదటి భాగం నిరాశగా, అయ్యో పాపం అనేటట్టుగా సాగుతుంది. ఫస్ట్ హఫ్ లో ఎక్కడో ఒకచోట నవ్వుతారు తప్పా, సెకండ్ హాఫ్ లో ఒరిజినల్ లో సీన్స్ మక్కికి మక్కికి దించేశారు. సెకండ్ హాఫ్ లో కాస్త మార్చి కమర్షియల్ సినిమాల చేశారు. క్లైమాక్స్ కూడా అసంపూర్తిగా వదిలేశారు. కోర్టు సీన్స్ లో భార్యగా ఈషా రెబ్బా అద్భుతమైన ఎమోషనల్ పండించవచ్చు. కానీ సింపుల్ గా ఏలాంటి ఎమోషన్ లేకుండా కనిపిస్తుంది. సినిమా మొదటిలో ఎమోషనల్ చూపించిన చివరిలో కమర్షియల్ గానే వదిలేశారు.
నటీనటుల యాక్టింగ్:
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ఇద్దరు పోటీపడి తమ పాత్రలలో అద్భుతంగా నటించారు. ఇక బ్రహ్మాజీ హీరో మేనమామ పాత్రలో బాగానే నవ్వించారు. బ్రహ్మానందం కూడా జడ్జి పాత్రలో సడన్ సర్ప్రైజ్ ఆకట్టుకుంటుంది. ఇక అందరి నటీనటుల గోదావరి యాసతో బాగా అద్భుతంగా ఆకట్టుకున్నారు.సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి, అలాగే డైలాగులు కూడా ఆకట్టుకుంటాయి, ఒరిజినల్ సినిమా కథకు మార్పులు చేర్పులు చేసి ఒక మహిళ ప్రాధాన్యతకు సంబంధించిన కథ అంశాలను చేర్చి తెరకెక్కించారు.
రేటింగ్
2.7/5
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి