ఉప్పెన చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు ఆ తర్వాత చిత్రం మెగా హీరో రామ్ చరణ్ తో పెద్ది సినిమాని అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ చిత్రం పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే కీలకమైన పాత్రలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే పెద్ది సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ , గ్లింప్స్ సినిమా అంచనాలను మరొకసారి పెంచేసాయి. ఈ ఏడాది మార్చిలో ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం భావించిన కొన్ని కారణాల చేత వాయిదా పడినట్లు తెలుస్తోంది.


అయితే తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న ప్రకారం ఈ సినిమా బాధ్యతలను డైరెక్టర్ సుకుమార్ తన భుజాన వేసుకున్నట్లు వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఎడిటింగ్ పనులను స్వయంగా సుకుమార్  పర్యవేక్షిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. సినిమాకి సంబంధించి ప్రతి ఫ్రేమ్ కూడా ఫర్ఫెక్ట్ గా ఉండాలని ప్రత్యేకించి మరి శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది సుకుమార్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఎడిటింగ్ కూడా పూర్తి అయ్యిందని డైరెక్టర్ సుకుమార్ స్క్రిప్టులో కొన్ని కీలకమైన మార్పులు చేసినట్లుగా సమాచారం.


అలాగే డైరెక్టర్ బుచ్చిబాబుతో దగ్గరుండి మరి ఈ ప్రాజెక్టుకి సంబంధించి అవుట్ పుట్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా సుకుమార్ చూసుకుంటున్నారు. సుకుమార్ రైటింగ్ తో పాటు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉండడంతో బడ్జెట్ విషయంలో వెనుకడుగు వేయడం లేదు. అలాగే ఏఆర్ రెహమాన్ కూడా సంగీతం అందించడం ఈ సినిమాకి ప్లస్ గా మారబోతోంది. మరి డైరెక్టర్ సుకుమార్ పర్యవేక్షణలో వస్తున్న ఈ పెద్ది చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి. మెగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: