టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం దేవర. ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేక మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది. కానీ కలెక్షన్స్ పరంగా రూ .500 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇందులో ఎన్టీఆర్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు. సినిమా చివరిలో కూడా దేవర 2 ఉంటుందనే విషయాన్ని చిత్ర బృందం ప్రకటించారు. 2024లో విడుదలైన దేవర సినిమాకి సీక్వెల్ పై పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.


గతంలో దేవర 2 సినిమా రావడం చాలా కష్టమని వార్తలు వినిపించాయి. ఈ విషయం పైన అటు నిర్మాతలు, డైరెక్టర్  కూడా స్పందించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా షూటింగ్ అప్డేట్ బయటికి వచ్చినట్లు వినిపిస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ కొరటాల శివ దేవర సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ ను నవంబర్ నుంచి మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయని ప్రస్తుతం సంగీతానికి సంబంధించి పనులైతే జరుగుతున్నట్లు సమాచారం.


ముఖ్యంగా నార్త్ ఇండియన్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునే విధంగా ఈ సినిమాలోని కథను మార్చినట్లుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ ప్రారంభంలో ఎన్టీఆర్ అవసరం లేని సన్నివేశాలను ముందుగా చిత్రీకరించేలా డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారట. జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీఖాన్ విలన్ ,సంగీతాన్ని కూడా అనిరుధ్ అందించారు. కీలకమైన పాత్రలలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ వంటి నటీనటులు నటించారు. దేవర సినిమాతో అభిమానుల నిరాశపరిచిన డైరెక్టర్ కొరటాల శివ మరి దేవర 2 చిత్రంతో అభిమానులను ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి మరి. అలాగే ఎన్టీఆర్ ప్రస్తుతం  ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఏడాది ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: