నందమూరి ,బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న చిత్రం NBK -111 ఈ చిత్రాన్ని కూడా దసరా బరిలోనే విడుదల చేయబోతున్నారు. వీరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నది. డైరెక్టర్ హనురాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న పీరియాడికల్ చిత్రం ఫౌజీ. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. అలాగే మరో యంగ్ హీరో రోషన్ మేక తన తదుపరి చిత్రాన్ని ఏమో ఏమో ఇది చిత్రంతో దసరా కానుకగా రాబోతున్నారు.అలాగే డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. సినిమా టీజర్ ను విడుదల చేయగా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.దీంతో ఈ సినిమాని కూడా దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు.
వీటితో పాటుగా కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న శేయోన్ సినిమాని కూడా అక్టోబర్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని కమలహాసన్ నిర్మిస్తుండగా గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా. ఇక ఇవే కాకుండా చాలా ప్రాజెక్టులు సైతం దసరా కి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. మరి దసరా బరిలో ఏ ఏ సినిమాలు నిలుస్తాయో, ఏ ఏ సినిమాలు పోస్ట్ ఫోన్ అవుతాయో చూడాలి మరి. మొత్తానికి ఈసారి దసరా బరిలో కూడా బడా చిత్రాల పోటీ తప్పడం లేదు. మరి ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి