ఇందులో భాగంగా మార్చి ఏడవ తేదీన ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయగా సోషల్ మీడియాలో కూడా సంచలనం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన కేవలం 48 గంటలలోనే అన్ని ప్లాట్ ఫామ్ లలో కలిపి సుమారుగా 312 మిలియన్ వ్యూస్ మార్కును దాటి ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒకసారి కొత్త రికార్డును సృష్టించింది. దురంధర్: ది రివేంజ్ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. దాదాపుగా 45 కంటే ఎక్కువ దేశాలలో కూడా యూట్యూబ్ ట్రెండింగ్ లో అగ్రస్థానంలో ఉన్నది.
దీంతో దురంధర్ 2 సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి భాగం సాధించిన విజయం తర్వాత సిక్వెల్ అంతకుమించి యాక్షన్ సీన్స్ తో ఉండబోతున్నట్లు ట్రైలర్లో చూపించారు. ఇందులో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు కీలకమైన పాత్రలో కనిపించారు. ఇప్పుడు భారీ అంచనాల మధ్య వస్తున్న సీక్వెల్ కు అంతకుమించి రికార్డులు సృష్టిస్తుందని ట్రెండ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి 19న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టేలా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి