జన వాక్యం కొన్ని పనులు చేసేటప్పుడు ప్రయోగాలు చేయకూడదు. ముఖ్యంగా తన సొంత బిడ్డను తెరకు పరిచయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నీ విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చేయాల్సిన పనులను సంపూర్ణంగా చేశాక జయాపజయాలను ప్రేక్షకులకు వదిలేయాలి. కానీ ఎం.ఎస్.రాజు దర్శకత్వం చేయాలన్న తన కోరికను కొడుకు సినిమాతో తీర్చుకోవాలనుకొని తొలి తప్పు చేశారు. మన సినిమా ఎలా ఉన్నా మనకు చాలా ముద్దుగానే అనిపిస్తుంది. అదే వేరే దర్శకుడు దర్శకత్వం చేసి ఉంటే అతను చేసే తప్పులన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. ‘వాన’ చిత్రమే దర్శకుడిగా ఎం.ఎస్. రాజుకు జీవితానికి సరిపడా గుణపాఠం చెప్పింది. దూరంగా ఉండి దర్శకుడికి సలహాలు ఇవ్వడం, దర్శకత్వం చేయడం ఒక్కటే కాదన్న సత్యాన్ని ఎం.ఎస్.రాజు గ్రహించి, మంచి దర్శకుడి చేతిలో సుమంత్ అశ్విన్ ను పెట్టి ఉంటే మరింత మంచి ఫలితం ఉండేది.  సినిమా పేరు – తూనీగ తూనీగ  సంస్థ – పద్మిని ఆర్ట్స్ సమర్పణ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు)  నటీనటులు – సుమంత్ అశ్విన్, రియా చక్రబర్తి, మనీషా యాదవ్, నాగబాబు, ప్రభు, పరుచూరి వెంకటేశ్వరరావు, సీత, గీత, సాయాజీ షిండే, చంద్రమోహన్, వసుంధర కాశ్యప్, విజయచందర్, వినోద్ కుమార్, అభి, అభినయ, ఏవీయస్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు తదితరులు  కెమెరా – ఎస్.గోపాల్ రెడ్డి సంగీతం – కార్తిక్ రాజా ఎడిటింగ్ – కె.వి.కృష్ణారెడ్డి  నిర్మాత – మాగంటి రాంచంద్రన్  రచన – పరుచూరి బ్రదర్స్  దర్శకత్వం – ఎమ్మెస్ రాజు  కథా కమామీషు - ఆర్.ఆర్. గ్రూఫ్ ఆఫ్ కంపెనీకి అధినేత నాగబాబు. అతని స్నేహితుడు తమిళ రామస్వామి (ప్రభు). రామస్వామి నాగబాబు ఇంట్లోనే వంట మనిషిగా ఉంటాడు. డా.జేమ్స్ (సాయాజీ షిండే) వీరిద్దరికీ స్నేహితుడు. నాగబాబు కూతురు నిధి (రియా). రామస్వామి కొడుకు కార్తిక్ రామస్వామి (సుమంత్ అశ్విన్). నాగాబాబు తండ్రి విజయ్ చందర్. చిన్నప్పటి నుంచీ ఒకే చోట పెరుగుతారు నిధి, కార్తిక్. అన్నీ సినిమాలకు మల్లే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. కార్తిక్ చేసిన అల్లరి కారణంగా నిధి తల్లి (సీత) నిధిని అమెరికాలో చదివిస్తుంది. కొంతకాలం తర్వాత నాగబాబు ఇచ్చిన బిజినెస్ పార్టీకి సన్నిహితులు అందరూ హాజరవుతారు. ఆ ఫంక్షన్ కు రామస్వామి, అతని మామ (పరుచూరి వెంకటేశ్వరరావు) వంట పనులను చూస్తారు. అక్కడికి వచ్చిన కార్తిక్, నిధి అందానికి ముగ్ధుడవుతాడు. అతనికి పచ్చపొడిచే అతను (షఫి) ప్రేయసి పేరును పచ్చపొడిపించుకోమని వెంటపడుతుంటాడు. తాను ప్రేమిస్తున్న అమ్మాయి నిధి అని తెలిశాక తన పేరు బాలాజీ అని చెప్పి ఆమెకు మరింత దగ్గరవుతాడు. ఆ క్రమంలోనే ఓ లవ్ లెటర్ రాసి నిధికి కార్తిక్ గా దొరికిపోతాడు. అక్కడి నుంచి వారిద్దరి ప్రేమ, విడిపోవడం జరుగుతుంది. రియాకు తన బావతో పెళ్ళి కుదురుతుంది. ఇటు కార్తిక్ తన లైఫ్ యాంబిషన్ దిశగా అడుగులు వేసే క్రమంలో తన తోటి డ్యాన్సర్ (మనీషా యాదవ్) తో పెళ్ళికి సిద్ధమవుతాడు. చివరికి ఈ రెండు జంటలు ఎలా కలిశాయన్నది సినిమా. విశ్లేషణ ఎం.ఎస్.రాజు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం సినిమాలు బాగా గుర్తుకొస్తాయి. నువ్వొస్తానంటే లో హీరోయిన్ కి అవమానం జరుగుతుంది. ఇక్కడ హీరోకి జరుగుతుంది. సన్నివేశాలు కల్పితంగానే ఉంటాయి. నాయికలు ఇద్దరూ సినిమాకు మైనస్. హీరో చురుగ్గా ఉన్నాడు. డ్యాన్సులు, ఎక్స్ ప్రెషన్స్ అన్నీ చాలా బాగా చేశాడు. డబ్బింగ్ కూడా బావుంది. కాకపోతే నాయిక పక్కన తమ్ముడి లాగా కనిపించాడు. నాగబాబు, ప్రభు, విజయ్ చందర్, వినోద్ కుమార్ అందరి పాత్రలు బావున్నాయి. చాన్నాళ్ళ తర్వాత సినిమాలో ఆడవారి కుట్ర ప్రధాన విలనీగా కనిపిస్తుంది. కథ చాలా వీక్. తూనీగ తూనీగను చూస్తే కుటుంబకథా చిత్రాలు దాదాపు పది గుర్తుకొస్తాయి. రెండో సగం కన్నా ఫస్టాఫ్ సినిమానే కాస్త బావుంది. సెకండ్ హాఫ్ లో దిల్రాజు చేయించిన మార్పులేంటో అర్థం కాదు. సినిమా నత్త నడక నడిచింది. పరుచూరి వెంకటేశ్వరరావు పాత్ర ఎప్పుడూ నాగబాబు డబ్బును గురించి తిట్టడమే. నటీనటులందరూ హేమాహేమీలే. కానీ ఏం ప్రయోజనం. బెంజి కారు నడవాలన్నా అందులో పెట్రోల్ ఉండాలి కదా. పచ్చపొడిపించుకునే సీన్ కోసం షఫి లాంటి క్యారక్టర్ ను ఇన్వాల్వ్ చేయాల్సి న అవసరం లేదు. సాంకేతిక పనితీరు  ఉన్నంతలో చెప్పుకోదగ్గది కెమెరా పనితనం. కొత్త కుర్రాడిని ఎలా ప్రెజెంట్ చేస్తే బావుంటుందో ఎస్.గోపాల్ రెడ్డికి ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లేదు. అందమైన లొకేషన్లను అంతే అందంగా చూపించారు. దిగు దిగు జాబిలి పాటలో కెమెరా పనితనం ప్రత్యేకంగా కనిపిస్తుంది. కార్తిక్ రాజా నేపథ్య సంగీతం బావుంది. తూనీగ తూనీగ యువతకు బోనస్. దిగు దిగు జాబిలి అందరినీ మెప్పేంచే స్వీట్ మెలోడీ. మిగిలిన పాటలు ఎఫెక్టివ్ గా లేవు. బాణీలను ఎన్నుకున్న ఎం.ఎస్.రాజుకే ఆ మైనస్ కూడా చేరుతుంది. ఇంటర్వల్ బ్లాగ్ బావుంది. ఎక్కడో కొన్ని చోట్ల తప్పితే సినిమా అంతా బోర్ గానే ఉంది. మాగంటి రాంజీ భారీగా ఖర్చుపెట్టారు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో మరీ బోర్ కొట్టిస్తుంది. ధర్మవరపు, ఎం.ఎస్, ఏవీయస్ ... అంటూ ఇందరున్నా సినిమా హాల్లో ఎక్కడా నవ్వులు వినిపించవు. డైలాగులు చాలా పూర్. సినిమాకు ముందు ఇచ్చిన హైప్ కి, సినిమా చూపించిన దానికీ ఎక్కడా పొంతన లేదు.  మా మాట – తూనీగ తూనీగ ఎం.ఎస్.రాజును ఓడించింది. సుమంత్ అశ్విన్ ను నిలబెట్టింది.  రేటింగ్ – 4.5\10 - మిథున్ 

మరింత సమాచారం తెలుసుకోండి: