నటీనటులు: హరీష్ కళ్యాణ్, అతుల్య రవి, వివేక్ ప్రసన్న, వినయ్ రాయ్, సచిన్ కెడ్కార్ .
రచన డైరెక్షన్: షణ్ముగం ముత్తుస్వామి.
ఒక భాషలో సినిమా హిట్ అయిన తర్వాత ఓటీటీ వేదికల ద్వారా అన్ని భాషల్లోకి రిలీజ్ అయి ప్రేక్షకులను చాలా సినిమాలు అబ్బురపరుస్తున్నాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డీజిల్ మూవీ. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూద్దాం.
స్టోరీ:
చెన్నై సముద్రతీర సమీపంలో సర్కార్ కు సంబంధించిన క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ ఉంటుంది. ఈ పైపులైన్ సముద్ర తీరానికి వెళ్లే దారికి అడ్డుగా వేస్తారు. దీంతో సముద్ర తీర ప్రాంతాల్లో బ్రతికే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడానికి పైప్ లైన్ అడ్డుగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ విషయంపై సర్కార్ కి ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోరు. అయితే దీని ద్వారా మత్స్యకారులకు ఏర్పడిన నష్టాన్ని ఆ క్రూడ్ ఆయిల్ ద్వారానే తీర్చుకోవాలని భావించిన మనోహర్( సాయికుమార్ ) ఆ పైప్ లైన్ నుంచి ఆయిల్ దొంగిలిస్తూ ముంబైలో పటాన్ (సచిన్ ఖేడ్కర్) ఆయిల్ రిఫైనరీకి పంపి పెట్రోల్, డీజిల్ గా తక్కువ డబ్బులకి అమ్ముతూ ఉంటారు. వచ్చిన సొమ్మును మత్స్యకారుల కుటుంబానికి సాయం అందిస్తారు. అలా కాలక్రమేణా మనోహర్ కొడుకు డీజిల్ అలియాస్ వాసు( హరీష్ కళ్యాణ్) ఈ సిండికేట్ వ్యవహారాలు చూసుకుంటూ వస్తాడు. అలా నడుస్తున్న సమయంలో ఈ సిండికేట్ వ్యాపారం కోసం బాలమురుగాని (వివేక్ ప్రసన్న ) డీసీపీ మాయవెల్ ( వినయ్ రాయ్ ) చేతులను కలుపుతారు. ఈ వ్యాపారం వీరి చేతుల్లోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది పోలీసులను చూసి వాసు ఎందుకు పారిపోవలసి వచ్చింది.. ఆయన ప్రజల కష్టాలను ఏ విధంగా తీర్చాడు అనేది సినిమా స్టోరీ..
ఎలా ఉందంటే?
ఇక సినిమా గురించి చెప్పాలంటే కష్టాల్లో ఉన్నప్పుడు హీరో ఎంట్రీ ఇచ్చి వారి కష్టాలను ఏ విధంగా తీరుస్తారు. అంతేకాకుండా ఆ కష్టాలు తీర్చడానికి హీరో శ్రమించే సమయంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటారు అనేది చాలా డిఫరెంట్ గా చూపించారు. అయితే పాత కథలాగే అనిపించినా కానీ క్రూడ్ ఆయిల్ అనేది చూపించడం చాలా కొత్తగా అనిపిస్తుంది. దర్శకుడు షణ్ముగం ముత్తుస్వామి దీనికోసం ఎంచుకున్న క్రూడ్ ఆయిల్ ఎలిమెంట్ అందరినీ ఆకట్టుకుంది. కొంతమంది వ్యాపారస్తులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తారు.. వారికి అధికారులు ఏ విధంగా సహకరిస్తారు. ఆ సమయంలో ప్రజలకు సర్కారుకు అధికారులకు మధ్య ఏర్పడే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది చాలా అద్భుతంగా చూపించారు దర్శకుడు.. ముఖ్యంగా సముద్ర తీరాల్లో ఉండే మత్స్యకారులు ఆ పైప్ లైన్ అడ్డం వేయడం వల్ల బోట్లు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. దీనివల్ల పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్టు చూపించారు. అంతేకాకుండా క్రూడాయిల్ ఎలా రవాణా చేస్తారు.. దాని వివిధ రూపాల్లోకి ఏ విధంగా మారుస్తారు అలా మార్చిన తర్వాత ట్యాంకుల్లోకి ఎలా పంపుతారు అనేది కూడా చూపించారు.. ఈ విధంగా అక్రమంగా తరలించే క్రూడాయిల్ ను ఎవరూ పట్టుకోరు.. దీనికోసం పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది కూడా చూపించారు. అయితే సినిమా చూస్తున్నంత సేపు ఒక సిండికేట్ నడిపించాలంటే ఎంత తతంగం ఉంటుంది దానికి అధికారులు ప్రభుత్వాలు ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి అనేది కూడా ఇందులో ఉన్నది.. ఇంచుమించు పుష్ప కథలో ఏ విధంగా ఎర్రచందనం తరలించారో ఇందులో క్రూడాయిల్ కూడా ఆ విధంగానే తరలిస్తారు. అయితే వచ్చిన డబ్బులు మాత్రం ప్రజలకు పంచి వారి బ్రతుకులు బాగు చేస్తారు.. ఈ కథలోనే లవ్, ఎమోషన్, కామెడీ ఇలా అన్ని కలగలిపి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు డైరెక్టర్.
నటీనటుల పర్ఫామెన్స్:
డీజిల్ అలియాస్ వాసు పాత్రలో హరీష్ కళ్యాణ్ అద్భుతంగా నటించారు. ఇందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యతనైతే కనిపించలేదు. ఇక దర్శకుడు సినిమాలు తెరకెక్కించిన తీరు చాలా అద్భుతంగా కనిపించింది. చాలా కొత్తదనం కనిపిస్తోంది.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల పర్ఫామెన్స్..
మొదటి భాగం చాలా నచ్చుతుంది
మైనస్ పాయింట్స్:
పాత కథలాగే అనిపించడం..
ఇందులో కాస్త లవ్ ట్రాక్ ఉండడం
చివరగా: కుటుంబంతో కలిసి చూడవలసిన చిత్రం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి