హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లబోతోంది. అయితే... ఇంతకీ ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. మొదట ఈ చిత్రం కోసం సమంత పేరును పరిశీలించారట. అయితే... ఇప్పటికే సమంత చేతిలో ఓ అరడజను సినిమాలున్నాయి. తాజా తమిళంలో కూడా ఓ భారీ ప్రాజెక్ట్ ఒప్పుకుంది. కాబట్టి కాల్ షీట్లు అడ్జెస్ట్ చేయలేదని ఆమెను వద్దనుకున్నారు. తారక్ పక్కన తాప్సీ ని కూడా అనుకున్నారట. తాజాగా మరో కొత్త హీరోయిన్ రెజీనా పేరు వినిపిస్తోంది. అయితే.... ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు వల్లే ప్రముఖ హీరోయిన్లు పక్కకు జరిగారని తెలుస్తోంది. ఎందుకంటే కాస్ట్ కటింగ్ లో భాగంగా మరీ అంతగా బిజీకాని హీరోయిన్ ను పెట్టుకోవడమే మంచిదని ఆయన భావిస్తున్నారు. సమంత, తాప్సిల పారితోషికాలు ఇప్పటికే ఆకాశాన్నంటేస్తున్నాయి. ఎలాగూ తారక్ తో భారీ బడ్జెట్ చిత్రం చేయాలి. కాబట్టి ఆమేరకు కాస్తైనా పొదుపు చేయాలంటే హీరోయిన్ విషయంలోనే కాస్ట్ కటింగ్ చేయాలని రాజు అనుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: