ఈ మధ్య శ్రుంగార ప్రధాన చిత్రాల తాకిడి ఎక్కువైపోయింది. ముఖ్యంగా కన్నడ, మలయాళ భాషల నుంచీ దిగుమతై అనువాదమౌతున్న చిత్రాల్లో 90 శాతానికి పైగా ఈ తరహా చిత్రాలే వస్తున్నాయి. తాజాగా ఓ మలయాళీ చిత్రం తెలుగులోకి రాబోతోంది. ఈ చిత్రం పేరు ‘ఆ ఒక్కటీ అడక్కు’. ‘రాసలీల’ పేరుతో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి కలెన్షన్లే రాబట్టింది. కేవలం శ్రుంగార స్పోరకంగా ఉండే ద్రుశ్యాలు మనవారిని అలరిస్తాయన్న నమ్మకంతోనే దీన్ని అనువదిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఓ పాత చిత్రం రీమేక్. చాలాయేళ్ల కిందట కమల్ హాసన్, జయసుధ నటించిన ఓ చిత్రం ఆధారంగా దీన్ని పునర్నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: