బంగారం భామ మీరాచోప్రా కొత్త ఆశల్ని పెంచుకుంది. తన యాటిట్యూడ్ తో సినిమాకు దూరమైన ఈ ఢిల్లీడాల్ నిన్నమొన్నటి దాకా హోటల్ బిజినెస్ లో నిమగ్నమైంది. ఇప్పుడు నాగార్జున సినిమా లవ్ స్టోరీ లో కీలక పాత్రలో కనిపించనుంది. ఇందులో నయనతార ప్రధాన నాయిక. మీరా చోప్రాకు ఇప్పటిదాకా తెలుగులో ఒక్క హిట్ కూడా లేదు. కింగ్ నాగార్జున నటిస్తున్న ఈ సినిమా అయినా మీరా కరీర్ కు ఉపయోగపడుతుందో లేదో చూడాలి. కామాక్షి మూవీస్ పతాకంపై చందన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దశరథ్ దర్శకుడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి