శివపుత్రుడుతో మంచి గుర్తింపు తెచ్చుకుని, గజని సినిమాతో హీరోగా స్థిరపడిన నటుడు సూర్య. ఈ తమిళ నటుడికి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. కాగా సూర్య నేడు జన్మదినం జరుపుకుంటున్నాడు. ప్రముఖ తమిళ నటుడు శివకుమార్, లక్ష్మీ దంపతులకు చెన్నైలో 1975, జులై 23న సూర్య జన్మించాడు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సూర్య 2006లో నటి జ్యోతికను వివాహం చేసుకున్నాడు. సూర్య ప్రసుత్తం మాట్రాన్, సింగం-2 సినిమాలలో నటిస్తున్నాడు. అలాగే సూర్య సోదరుడు కార్తీ కూడా హీరోగా రాణిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: