హీరో రామ్ చరణ్ బాలీవుడ్ పై కన్నెసిన విషయం తెలిసిందే. అతను నటిస్తున్న తొలి హిందీ సినిమా ‘జంజీర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ ‘జంజీర్’ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయడానికి సిద్ధపడుతున్నారు. తెలుగులో ఈ చిత్రానికి ‘జ్వాల’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే పేరుతో చిరంజీవి ఒక సూపర్ హిట్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ జంజీర్ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అపూర్వ లఖియా దర్శత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీహారి కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలను అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: