ప్రిన్స్ మహేష్ ఇప్పుడు మంచి దూకుడు మీద ఉన్న సంగతి తెలిసిందే. అలాగే మహేష్ భార్య నమ్రత ఇటీవలే ఒక చిన్నారికి జన్మనిచ్చింది. ఈ చిన్నారి సితార రాకతో మహేష్ లో మార్పు వచ్చిందని అతన్ని సన్నిహితులు అంటున్నారు.
పబ్లిక్ ఫంక్షన్లో పాల్గొనడానికి మహేష్ ఎక్కువగా ఇష్టపడడు అనే విషయం అందరికీ తెల్సిందే. అయితే భారీ ఎత్తున్న జరిగే తన జన్మదిన వేడుకలలో పాల్గొనటానికి మహేష్ అంగీకరించాడు. ఈ నెల 9న పద్మాలయ స్టూడియోలో జరిగే వేడుకలో పాల్గొనడానికి మహేష్ ఒప్పుకున్నడు.
ఇప్పటి వరకూ జరిగిన జన్మదినం వేడుకలలో మహేష్ పాల్గొనని విషయం తెలిసిందే. దీంతో మహేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సితార రాకతోనే మహేష్ బాబులో ఈ మార్పు వచ్చిందని వారు చెప్పుకుంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: