తమిళంలో భారీ నిర్మాణ సంస్థను స్థాపించి క్రేజీ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న నిర్మాత ఉదయనిధి స్టాలిన్. ఎందుకో మేకప్ వేసుకోవాలనే ఆశ కలిగింది ఆయనకు. వెంటనే ఒరు కల్ ఒరు కన్నాడి అనే సినిమాలో హీరోగా చేశారు. బొద్దు గుమ్మ హన్సిక నాయిక. తమిళంలో ఓకే ఓకే వంద రోజుల సినిమాగా ఆడింది., ఇప్పుడు ఆ సినిమాని తెలుగులో ఈ నెల 10న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ష్యూర్ సక్సెస్ గురించి బెల్లంకొండ ఘంటాపథంగా చెప్పడంతో తెలుగులోనూ ఓ రౌండ్ రావాలని అనుకుంటున్నాడు ఉదయనిధి. ఉదయనిధి తాత కరుణానిధి తెలుగువాడే. ఓకే ఓకే సినిమా హిట్టయితే ఉదయనిధి తెలుగులో స్థిరపడి ఇక్కడ కూడా వరుసగా సినిమాలను తీసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రిజల్ట్ 10న తెలుస్తుంది మరి.
మరింత సమాచారం తెలుసుకోండి: