చాలా సంవత్సరాలుగా పరిశ్రమ లో కొనసాగుతన్న రఘు కుంచెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే మాత్రం లభించలేదు. గాయకుడిగా, నటుడిగా పరిచయమైన రఘు కుంచె బంఫర్ ఆఫర్ సినిమాతో సంగీత దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తాడు. అయితే బంఫర్ ఆఫర్ సినిమా, ఆడియో హిట్టయినా రఘుకు మరో ఆఫర్ అయితే మాత్రం రాలేదు. దీంతో మళ్లీ పూరీ జగన్నాథ్ తన స్నేహితుడు రఘు కుంచె కెరీర్ కోసం పూనుకున్నాడు.  రెండవ సారి తన దేవుడు చేసిన మనుషులు చిత్రానికి చాన్సు ఇచ్చాడు.  రఘు స్వర పరిచిన డిసిఎం పాటలు మీద మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా ఈ నెల 15న విడుదల అవుతుంది.  ఈ డిసిఎం హిట్టయ్యి తనకి మరిన్నిచాన్సులు తీసుకుని వస్తుందని రఘు చాలా ఆశగా ఉన్నాడు 

మరింత సమాచారం తెలుసుకోండి: