జంట ఆస్కార్ లతో భారత జాతీయ జండాను ఆస్కార్ వేదికపై రెపరెపలాడించిన సంగీతవీరుడు రెహమాన్ మాతృభాష మలయాళం. అతని తండ్రి కేరళకు చెందిన వ్యక్తి. తల్లిది తమిళనాడులో సెటిలైన మలయాళ ఫ్యామిలీ. కానీ రెండు తరాలుగా ఈ కుటుంబం చెన్నైలోనే నివసించడంతో ఇప్పుడు ఇంట్లో అందరూ తమిళంలోనే మాట్లాడుకుంటారు. ఈ సంగీతమాంత్రికుడు త్వరలో ఓ మలయాళ సినిమా కోసం పనిచేయనున్నారట. అదీ సంగీత దర్శకుడిగా కాదు. నటుడిగా. రెహమాన్ హిందీలో నటిస్తారన్న వార్తలు గుప్పుమన్నాయి. కానీ అంతకన్నాముందు తన మాతృభాషలో నటించాలన్నది ఈయన అభిమతమట. 

మరింత సమాచారం తెలుసుకోండి: