సిరియాలో జరిగిన ఘోరమైన రసాయన దాడి ఘటన అగ్రదేశాలు అమెరికా, రష్యా మధ్య చిచ్చుపెడుతోంది. రసాయన దాడి అనంతరం సిరియాలోని ఎయిర్‌బేస్‌లపై అమెరికా క్షిపణిలతో దాడులు చేయడాన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా దాడుల పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చట్టాలకు అమెరికా భంగం కలిగిస్తూ క్షిపణులతో దాడులు చేస్తోందని మండిపడ్డారు.



అమెరికా ఇదే విధానాన్ని కొనసాగిస్తే అమెరికా, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడం ఖాయమని ఆయన అన్నారు. పేపర్‌పై మాత్రమే పరిమితమైన ఇరుదేశాల బంధం మరింత బలహీన పడనుందని ఆయన హెచ్చరించారు. రష్యా అధికార ప్రతినిధి మాట్లాడుతూ సార్వభౌమత్వం కలిగిన ఓ దేశంపై అమెరికా దురాక్రమణకు పాల్పడుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అమెరికా ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: