కొంతమంది అదృష్టం ఎలా ఉంటుంది అంటే.. అదృష్టం అంటే ఇదే అన్నట్టు ఉంటుంది. ఆ అదృష్టాన్ని చూస్తే అసూయా కల్గుతుంది. అలాంటి అదృష్టమే ఇంగ్లాండ్ లోని ఓ ముసలాయనకు కల్గింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటూ ఉంటారు. నిజంగానే ఆ ఓల్డ్ వల్ల ఆ వృద్ధుడు గోల్డ్ కొనేంత సొంతమయ్యింది. ఇంగ్లాండ్‌లోని హ్యాంప్‌షైర్‌కు చెందిన రోజర్ కూపర్ అనే 70 ఏళ్ళ వృద్ధుడి కథ ఇది. 


 ఇంకా విషయానికి వస్తే.. రోజర్ కూపర్ హాంకాంగ్‌లో నేవీ ఉద్యోగిగా పనిచేసేవాడు. అయితే అతని 21వ పుటిన రోజు సందర్బంగా ఆరోజు రోజర్ ఎంతో ఇష్టపడి ఒమేగా కంపెనీ తయారుచేసిన స్పీడ్ మాస్టర్ అల్ట్రామ్యాన్ వాచ్ ను కొన్నాడు. అయితే ఆ వాచ్ అప్పుడే 35 పౌండ్లు ఉండేది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 3179 లకు ఆ వాచ్ ని రోజర్ కొన్నాడు. 


అయితే అప్పుడు అతని జీతం వారానికి 900 రూపాయిలు మాత్రమే అని.. కానీ ఆ వాచ్ అతనికి బాగా నచ్చడంతో కరిగినప్పటికీ ఎంతో ఇష్టంతో కొన్నట్టు అయన చెప్పాడు. కొన్ని సంవత్సరాల పాటు ఆ వాచ్ ఉపయోగించక అది పని చేయడం మానేసింది. అయితే ఆ వాచ్ ని పడేయడం ఇష్టం లేకపోవడంతో అలాగే ఇంట్లో ఏంటో భద్రంగా దాచుకున్నాడు. 


అయితే ఇటీవలే గార్డినర్ హౌల్‌గేట్ అనే ఆక్షన్ హౌస్ నిర్వహించిన ఆక్షన్‌లో తన వాచ్‌ను కూడా అమ్మాలని రోజర్ వెళ్లాడు. ఆ వాచ్‌ ఎవరైనా కొంటారా ? అనే అనుమానంతో వెళ్ళాడు. కానీ ఒక్కసారిగా ఆ ఆక్షన్ లో ఆ వాచ్ ధర చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. 45 పౌండ్ల వాచ్ ను దాదాపు 40 వేల పౌండ్లకు కొన్నారు. దీంతో రోచర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. 


అయితే ఈ వాచ్ చాలా అరుదైనది అని, మూన్ మీదకు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కూడా ఇటువంటి వాచ్‌ని ధరించి వెళ్ళాడు అని.. అందుకే ఫేమస్ అయినట్టు ఆక్షనీర్ డేవిడ్ హీర్ తెలిపారు. 1968లో ఈ మోడల్ వాచ్‌లను ఒమెగా కంపెనీ చాలా తక్కువ సంఖ్యలోనే తయారుచేసిందని, రోజర్ 1969 ఫిబ్రవరిలో ఈ వాచ్‌ను కొనుగోలుచేశాడని డేవిడ్ పేర్కొన్నాడు. ఏది ఏమైనా 3 వేల విలువ పాత వాచ్ తో 36 లక్షలు సంపాదించేశాడు ఈ వృద్ధుడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: