హైదరాబాద్ కు చెందిన 25 ఏళ్ల యువతి చరితా రెడ్డి ఎల్ల అమెరికాలోని మిచిగాన్ లో సాఫ్ట్ వేర్ ఫర్మ్ లో పనిచేస్తుంది. సాఫ్ట్ వేర్ సంస్థ అయిన డెలాయిట్ లో చరితారెడ్డి ఉద్యోగం చేస్తూ లాన్సింగ్ లో నివాసముండేవారు. 4ఏళ్ల క్రితమే ఆమె తన ఎం.ఎస్ చేసేందుకు అమెరికాకు వెళ్లారు.


అయితే, మొన్న రాత్రి 8:50టైంలో ఒట్టావా పరిధిలోని క్రొకెరీ టౌన్ షిప్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కార్ కు ఆక్సిడెంట్ జరిగింది. ఫుల్ గా మద్యం తాగిన ఓ వ్యక్తి చరితా రెడ్డి ప్రయాణిస్తున్న టయోటా కార్ ని వెనుక నుంచి మరొక కారుతో వేగంగా ఢీకొట్టాడు. ఆ సమయంలో చరితారెడ్డి తన కారు వెనుక సీట్ లో కూర్చోవడం వలన ఆమెకు బాగా గాయాలయ్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె కోమాలోకి వెళ్లిపోయారు.


సమీపంలోని స్థానిక హాస్పిటల్ కు ఆమెను హుటాహుటిన తరలించగా... అక్కడి వైద్యులు చరితా రెడ్డి బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పారు. కారులో చరితా రెడ్డి తో సహా మరో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఓ స్థానిక ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. చరితారెడ్డి భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం హైదరాబాద్ కు తరలించనున్నారు. హైదరాబాద్ లోని సికింద్రాబాద్‌ నేరేడ్‌మెట్‌ ప్రాంతంలో నివసిస్తున్న చరితా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 


మిస్కీగన్ కు చెందిన 40ఏళ్ల వ్యక్తి మద్యం తాగి కారుని మితిమీరిన వేగంతో డ్రైవ్ చేయడం వలనే ఈ ప్రమాదం జరిగిందని అమెరికా పోలీసులు నిర్దారించారు. అయితే, ఈ ప్రమాదం చేసిన వ్యక్తికి ఎటువంటి గాయం అవ్వలేదు.


gofundme అనే ఫండ్ రైసింగ్ వెబ్సైటు లో చరితారెడ్డి కజిన్ జయంతి గానుగుపాటి ఆమె అంత్యక్రియలు కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. చరితా అందరిని సమస్యలను విని వారికి సాయం చేసేదని, స్నేహితులని, ఫ్యామిలిని బాగా ప్రేమించేదని.. అటువంటి ఆమె చనిపోయిందంటే నమ్మలేకపోతున్నానని జయంతి గానుగుపాటి ఆ వెబ్సైటు లో పేర్కొన్నారు. గతంలో అవయవ దానం చేస్తానని చరితా చెప్పారని, అందుకే ప్రస్తుతం ఆమె అవయవాలను వైద్యులు సేకరిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: