యూరప్ సహా ఇతర దేశాల్లో వైద్య విద్యకు అనుకూలంగా ఎన్నో పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. వైద్య విద్య విషయంలో యూరప్ దేశాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి అనే సంగతి తెలిసిందే. ఆ దేశాల్లో ఎన్నో సౌకర్యాలు ఉన్న నేపధ్యంలో మన దేశం సహా ఇతర దేశాల నుంచి చాలా మంది వెళ్లి అక్కడ వైద్య విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కొన్ని వార్తలు యూరప్ దేశాలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. కరోనా కారణంగా చాలా దారుణంగా నష్టపోయిన ప్రాంతాల్లో యూరప్ కూడా ఒకటి అనే విషయం అందరికి తెలిసిందే. యూరప్ లో కరోనా కట్టడికి ఎన్నో చర్యలు తీసుకున్నారు.

లాక్ డౌన్ విధించినా సరే సాధారణ పరిస్థితి అనేది అక్కడ రాలేదు. దీనితో ఆందోళన అనేది మొదలయింది. అక్కడి ప్రభుత్వాలు ప్రజలను కాపాడుకోవడానికి ఎం చేయాలో కూడా అర్ధం కాని స్థితిలో ఉన్నారు అనే మాట నిజం. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కొన్ని అభిప్రాయాలు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అది ఏంటీ అంటే... యూరప్ దేశాల విషయంలో  ఇప్పుడు మన దేశం సహా చాలా దేశాలు భయపడుతున్నాయి. దానికి కారణం కరోనా... అక్కడ వైద్య విద్య కోసం వెళ్ళాలి అని భావించిన చాలా మంది వెనకడుగు వేస్తున్నారు.

ఆ దేశాలకు వెళ్ళడం కంటే లాటిన్ అమెరికా దేశాలే నయం అనే భావనలో ఉన్నారని సమాచారం. ఆ దేశాల కోసం ముందు దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు రద్దు చేసుకునే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. అక్కడ కరోనా నష్టం ఎక్కువగా ఉండటంతో విద్యా వ్యవస్థ కచ్చితంగా వెనుకడుగు పడే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి మన దేశం నుంచి వెళ్ళే వాళ్ళు అక్కడికి మొగ్గు చూపడం లేదట మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: