కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం షార్క్ నోటికి చిక్కినప్పటికీ ఎంతో చాకచక్యంగా తప్పించుకుంది. ఏకంగా 35 సెకండ్ల పాటు షార్క్ తో పోరాటం చేసి చివరికి ప్రాణాలతో బయట పడింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో వెలుగులోకి వచ్చింది. ఈత కొట్టడానికి సముద్రం లోకి వెళ్ళింది మహిళ. సముద్రంలోకి వెళ్ళిన సెకండ్ల వ్యవధిలోనే షార్క్ చేప ఆమె కాళ్లను పట్టేసింది. కానీ ఎక్కడా భయపడకుండా ఆ మహిళ షార్క్ తో పోరాటం చేసింది. షార్క్ కాలుని పట్టుకోగానే 42 ఏళ్ల హెధర్ వేస్ట్ తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కాళ్లు చేతులు వేగంగా ఆడించడం ప్రారంభించింది. అంతే కాదు గుండెల్లో ధైర్యం నింపుకుని ఇక బలంగా షార్క్ ని కొట్టడం ప్రారంభించింది.
చివరికి షార్క్ వదిలేయడంతో వేగంగా ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేసింది. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు సదరు మహిళ మీడియాతో వెల్లడించారు. సముద్రంలోకి వెళ్ళినప్పుడు బాగానే ఉంది. కానీ కొద్ది సేపటి తర్వాత అలజడి మొదలయ్యింది. దీంతో ఏదో ఇబ్బంది వచ్చిందని అర్థం చేసుకున్నాను. సరిగా నా ఎడమ కాలు విపరీతమైన నొప్పి నొప్పి పుట్టడం స్టార్ట్ అయింది. ఇక షార్క్ కాళ్లను పెట్టేసింది అని అర్థం చేసుకుని షాక్ నుంచి తేరుకున్న కాస్త ధైర్యం తెచ్చుకుని షార్క్ తలపై బలంగా పిడిగుద్దులు గుద్దాను. దాదాపు 35 సెకన్ల తరువాత షార్క్ వదిలేసింది అంటూ హెదేర్ వెస్ట్ చెప్పుకొచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి