చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మొన్నటి వరకు  ప్రపంచ దేశాలలో ఎంతటి అల్లకల్లోల పరిస్థితులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శరవేగంగా వ్యాప్తిచెందుతూ మారణహోమం సృష్టించింది. కోట్ల మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇక్కడ ఎన్నో దేశాల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది.. ఇక ఎంతో మంది సామాన్యుల జీవితాలను దూరంగా మార్చేస్తుంది. ఇలా కరోనా వైరస్ మూడు దశలలో కరోనా  అందరిని భయాందోళనకు గురి చేసింది. అయితే అన్ని దేశాలు  ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి వైరస్ ప్రభావం నుంచి కాస్త బయట పడుతున్నాయ్.


 ఇలాంటి సమయంలో ప్రపంచం మొత్తం వైరస్ భారీ నుంచి బయట పడుతుంటే అటు కరోనా  పుట్టినిల్లు చైనాలో మాత్రం విజృంభిస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా భయాందోళనలు సృష్టిస్తోంది. ప్రతిరోజు భారీగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా చైనాలో వాణిజ్య రాజధానిగా  పిలుచుకొనె చైనాలోని షాంగై నగరంలోనె ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తున్నాయని తెలుస్తోంది.  రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్న పరిస్థితి ఏర్పడింది.


 ఈ క్రమంలోనే చైనాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఏకంగా 40 కోట్ల మంది ప్రజలు కూడా ప్రస్తుతం కరోనా కఠిన ఆంక్షలు మధ్య ఉన్నారు అన్నది తెలుస్తుంది. అక్కడ ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించకుండా దారుణంగా కరోనా ఆంక్షల ను  అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. చైనాలోని 40 కోట్ల ప్రజలు ప్రస్తుతం ఆంక్షల  గుప్పెట్లోనే ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. చైనాలోని షాంగై   నగరం లో అయితే రెండు వారాల నుంచి ప్రజలు కాలు కూడా బయట పెట్టడం లేదు. మొత్తంగా చైనాలోని 100 నగరాలలో 87 ప్రాంతాల్లో కఠినమైన కరోనా నిబంధనలు అమలు అవుతున్నాయి అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: