పెళ్లి అనేది నూరేళ్లపంట అన్న విషయం తెలిసిందే. అందుకే పెళ్లి విషయంలో ఎవరూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అని పెద్దలు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి వెనక ముందు ఆలోచించకుండా తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇక ఆ నిర్ణయానికి ప్రతిఫలం జీవితాంతం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని అంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక నేటి రోజుల్లో యువత అయితే పెళ్లి విషయంలో కాస్త డిఫరెంట్ గానే ఆలోచిస్తూ ఉన్నారు.


అందుకే ఇక పెళ్లిళ్లకు సంబంధించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి పెళ్లి  సోషల్ మీడియాలో అందరిని అవ్వక్కయ్యేలా చేస్తూ ఉంది. సాధారణంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఎవరైనా స్టైల్ గా సిగరెట్ తాగుతున్నారు అంటే చాలు ఇక వారిని చూసి  అమ్మాయిలు ప్రేమలో పడిపోవడం.. ఇక వారితో పెళ్లి జరిగితే బాగుంటుంది అని కోరుకోవడం లాంటివి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు.  కానీ నిజ జీవితంలో కూడా ఇక్కడ ఇలాంటిదే జరిగింది.


 ఒక చిన్న కారణానికే ఒక వ్యక్తితో ప్రేమలో పడిపోయింది యువతి. ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ పుట్టేందుకు పెద్ద కారణాలు అవసరం లేదు అని ఇక్కడ ఒక యువతి నిరూపించింది. పాకిస్తాన్ లో ఒక సంపన్న కుటుంబానికి చెందిన యువతి కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు డ్రైవింగ్ స్కూల్లో చేరింది. అయితే డ్రైవింగ్ టీచర్ చబి కారు గేరు మార్చే విధానాన్ని చూసి అతనితో ప్రేమలో పడింది సదరు యువతి. ఇక ఇటీవల  వారి ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లి వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ జంట ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ విషయం గురించి తెలిసి ఇలా కూడా ప్రేమలో పడతారా అని ఎంతో మంది నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: