ఇటీవల కాలంలో ఎంతోమంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకోవడానికి చిత్ర విచిత్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు కొన్ని కొన్ని సార్లు ఏకంగా ప్రాణాలను కూడా ఫణంగా పెడుతూ ఉండడం  చూస్తూనే ఉన్నాం. అయితే ఇలా గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు సంపాదించుకోవడం అంటే మాట్లాడినంత తేలిక కాదు అన్న విషయం దాదాపు అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అందరికంటే మనలో స్పెషల్ టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవచ్చు.


 కాగా ఇక ఈ ప్రపంచ రికార్డు సృష్టించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకోవడానికి ఎంతో మంది ఎన్నో విన్యాసలపై ఏళ్ల పాటు కఠోరా సాధన చేసి ఎవరికి సాధ్యం కాదు రీతిలో ప్రతిభను చూపిస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఇక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటుసంపాదించుకున్న వారు ఇక ఇలా వరల్డ్ రికార్డ్ సృష్టించడానికి గల కారణాలు తెలిపితే అందరూ ముక్కున వేలేసుకుంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా కాన్పు ద్వారా ఒక మహిళ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సృష్టించింది అని చెప్పాలి.


 అదేంటి కాన్పు ద్వారా మహిళ గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించడమేంటి అదెలా కుదురుతుంది అని అనుమానం మీ మనసులో వచ్చే ఉంటుంది. అయితే ఇది నిజంగానే జరిగింది. గత ఏడాది ఉత్తర ఆఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మనిచ్చింది. అయితే తాజాగా గిన్నిస్ వరల్డ్ దాన్ని ప్రపంచ రికార్డుగా గుర్తించింది అని చెప్పాలి. మొరాకోలోని కసాం లాక్కు చెందిన సీసా అనే మహిళ గర్భం దాల్చిన మహిళా సిజేరియన్ ద్వారా ఐదుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలకు జన్మనిచ్చింది. ఇప్పుడు వరకు ఎవరు కూడా ఇలా ఒకే ప్రవసం లో 9 మందికి జన్మనివ్వలేదు. దీంతో ఇక సీసా అనే మహిళ వరల్డ్ రికార్డు సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: