ఇంతకీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయిన అంశం ఏంటో తెలుసా? ఇంటి అద్దె.. అదేంటి ఇంటి అద్దె గురించి చర్చించుకోవడానికి పెద్దగా ఏముంటుంది అంటారా? సాధారణంగా ఎవరైనా సరే తమకంటూ ఒక ప్రత్యేకమైన నచ్చిన గది దొరికితే బాగుండని కోరుకుంటారు. కానీ ఇతరులతో బెడ్ షేర్ చేసుకునేందుకు ఎవరైనా రెంట్ కు తీసుకుంటారా. ఊరుకోండి బాస్ బెడ్ షేర్ చేసుకోవడం అంటే వినడానికి కంపరంగా ఉంది అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా బెడ్ షేర్ చేసుకోవడానికి కూడా రెంట్ కట్టాలి.
అదికూడా అక్షరాల 54000. మన దగ్గర నెలకు ఇంత చెల్లించాము అంటే దేశంలోనే టాప్ సిటీలో పెద్ద ఇంట్లో అద్దెకు ఉండేందుకు అవకాశం ఉంటుంది. కానీ కెనడాలో మాత్రం ఈ మొత్తం రూమ్ షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ డబ్బులు సరిపోతాయి అని చెప్పాలి. టొరెంట్ లోని ఒక మహిళ పెట్టిన పోస్ట్ చూసి ఏకంగా నైటిజన్స్ అందరూ కూడా నోరెళ్లపెడుతున్నారు. ఎందుకంటే ఏకంగా ఒక రూమ్ లో ఉన్న క్వీన్ సైజ్ బెడ్ షేర్ చేసుకోవడానికి నెలకు 900 కెనడియన్ డాలర్లు అంటే ఏకంగా భారత కరెన్సీలో 54 వేల రూపాయలు చెల్లించాలట. అయితే ఇక ఈ ఆఫర్ కి కొంత మంది ఓకే చెప్పడం కూడా గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి