మనం సినిమాల్లో చూసే కొన్ని ఘటనలు నిజజీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. సినిమాల్లో చూసి ఇలాంటివి నిజ జీవితంలో జరగడం అసాధ్యం అనుకున్న ఘటనలు సైతం ఇక రియల్ లైఫ్ లో జరిగి అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇలాంటి తరహా ఘటనలు ప్రపంచంలో నలుమూలలో ఎక్కడ జరిగిన కూడా కేవలం నిమిషాల వ్యవధిలో అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో వాలిపోతూ ఉన్నాయి.


 ఇక ఇలాంటి ఘటనలు గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. అయితే సాధారణంగా మనం సినిమాల్లో కొన్ని పాత్రలు విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఏకంగా సైకోలాగా బిహేవ్ చేస్తూ ఇక వారిపై వారే దాడి చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే నిజంగానే ఇలాంటి మానసిక సమస్యలు రియల్ లైఫ్ లో కూడా ఉంటాయా అని అనుమానం ఈ సన్నివేశాలను చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కలగక మానదు. అయితే ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే మాత్రం సినిమాల్లో చూపించడం కాదు.. ఇక ఈ ఘటన అంతకుమించి అనే రేంజ్ లోనే ఉంది అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది.


 సాధారణంగా ఎవరు కూడా వారిపై వారు దాడి చేసుకోరు. కానీ చెక్ రిపబ్లిక్ దేశంలో మాత్రం ఒక వ్యక్తి కత్తితో తన ప్రైవేట్ పార్ట్ ను కట్ చేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కోమాలోకి వెళ్ళిపోయాడు. అతను ఇలా ఎందుకు చేసుకున్నాడో అర్థం కాక.. వైద్యులు సైతం షాక్ లో మునిగిపోయారు. చివరికి ఇక ఇందుకు గల కారణాన్ని కనిపెట్టారు. అతను టిక్ బోర్న్ ఎన్సెపాలిటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడట. ఇదొక రకమైన మెదడు వ్యాపు వాది. దీనివల్ల సైకలాజికల్ సమస్యలతో విపరీత చర్యలకు పాల్పడతారు అంటూ వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: