నేటి ఆధునిక సమాజంలో మనిషి టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో మనిషి జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. మనుషులు ఆచరించే సాంప్రదాయాలు ఆచారాలలో కూడా మార్పులు చూస్తూనే ఉన్నాం.  మానవ బంధాలలో  కూడా ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నేటి ఆధునిక సమాజంలో కూడా అతి పురాతన పద్ధతులు ఆశ్చర్యానికి గురి చేసే ఆచారాలు పాటించే ప్రజలు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఉంటూనే ఉంటారు. ఇక వారికి సంబంధించిన వార్తలు తిరమీదికి వస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇలాంటి వింతైన ఆచారాలను ఎక్కువగా పాటించే ప్రాంతాలు ఆఫ్రికాలోనె ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే అక్కడ ఏరిత్రియ తెగ ఒకటి ఉంది. అయితే ఈ తెగ ప్రజలు వివాహం విషయంలో అందరితో పోల్చి చూస్తే భిన్నమైన ఆచారాలను సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారట. సాధారణంగా ఒక పురుషుడు ఒక మహిళను పెళ్లి చేసుకోవాలని ఏ ఆచారమైన చెబుతూ ఉంటుంది. కానీ ఇక్కడి ప్రజల ఆచారం ప్రకారం ఒక పురుషుడు తప్పకుండా ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవాల్సిందే. ఇది వినడానికి వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా అనిపిస్తుంది కదా. కానీ నిజంగానే ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా తెగలో ఇలాంటి సంప్రదాయం ఉందట.


 ఒక్క భార్యతో వేగడమే కష్టం అలాంటిది ఇద్దరు భార్యల అంటే అక్కడి పురుషులు ఏమైపోతారో.. అందుకే ఇక ఒక్క భార్యని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేస్తూ ఉంటారేమో అనుకుంటున్నారు కదా. అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోకపోతే అది నేరం కింద పరిగణించి  వారిని జైల్లో వేయిస్తారట. ఏకంగా అలాంటి వారికి జీవిత ఖైదు పడే ఛాన్స్ కూడా ఉంటుందట. అందుకే అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా తన భర్తను మరో మహిళతో పంచుకోవడానికి సిద్ధమవుతూ ఉంటుందట. అయితే ఈ తెగలో దశాబ్ద కాలంగా పురుషుల కంటే స్త్రీ జనాభా ఎక్కువగా ఉంటూ వస్తుందట. ఈ క్రమంలోనే స్త్రీ పురుషుల నిష్పత్తి సమానంగా ఉండేలా ఇక అక్కడి తెగ పెద్దలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: