ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రపంచం మొత్తం పాకిపోయింది. దీంతో నేటి రోజుల్లో జనాలు ఇక ఇలా ఇంటర్నెట్ ప్రపంచంలోనే బ్రతికేస్తున్నారు. ఒక్కరోజు ఇంటర్నెట్ లేకపోయినా ఏదో కోల్పోయాం అన్నట్లుగా బాధపడిపోతున్నారు. అయితే నేటి ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రపంచ నలు మూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో వాలిపోతుంది. ఇక ప్రతిరోజు ఎన్నో ఆసక్తికర ఘటనలు కూడా ఇలా వెలుగులోకి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని ఘటనల గురించి తెలిసిన తర్వాత లోకంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అనే భావన అందరికీ కలుగుతూ ఉంటుంది.


 ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా ఒక భార్య భర్త నుంచి విడాకులు కోరుకుంది అంటే కారణం ఏమై ఉంటుంది. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుంటేనో.. లేదంటే ఇక తరచూ తాగొచ్చి వేధింపులకు గురి చేస్తూ ఉంటేనే భర్త నుంచి విడిపోవాలి అని అనుకుంటుంది భార్య. ఒకవేళ భర్త ప్రేమగా చూసుకుంటూ ఇక ఊహించిన దానికంటే మంచినవాడు అయితే అమ్మో నాకు ఆ దేవుడి దయ వల్ల అదృష్టం కలిసి వచ్చింది లేకపోతే ఇంత మంచి భర్త ఎవరికి దొరుకుతాడు అని తెగ సంతోష పడుతూ ఉంటుంది.


 కానీ ఇక్కడొక మహిళ మాత్రం అలా చేయలేదు. తనకు భర్త మంచోడు అని చెప్పింది  చివరికి అతనికి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇలా భాగస్వామి మంచివాడు కాదని హింసిస్తున్నాడని విడాకులు ఇస్తున్న నేటి రోజుల్లో తన భర్త ఎంతో మంచోడు అంటూ విడాకులు ఇచ్చేసింది భార్య. బ్రెజిల్ ఫుట్బాలర్ కాకా అతి మంచి వ్యక్తి కావడంతో అతనికి విడాకులు ఇచ్చినట్లు అతని భార్య కరోలిన్ సేలికో తెలిపింది. కాకా నన్ను ఎప్పుడు మోసం చేయలేదు. బాగా చూసుకున్నారు అయినా సంతోషంగా ఉండేదాన్ని కాదు. అతను నా విషయంలో పర్ఫెక్ట్ గా ఉండటమే సమస్య అంటూ చెప్పుకొచ్చింది కరోలినా సెలికో. 2005 లో పెళ్లి చేసుకున్న వీరు 2015లో విడాకులు తీసుకున్నారు. ఈ విషయం గురించి తెలిసి దీనినే పిచ్చి అంటారు అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: