మొన్నామధ్య వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాష్ట్రపతి ఎన్నికల విషయమై కలవడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ తమ మద్దత్తు ఎన్డిఏ అభ్యర్ధికి ఇవ్వటానికే తాను ప్రధానిని కలిసినట్లు మీడియాతో చెప్పారు...అంతేకాకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగినట్లు కూడా చెప్పారు. అయితే వీరిద్దరి భేటీ విషయమై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎల్లో మీడియా లో ఒక ఛానల్ జగన్ ప్రధాని భేటీలపై ఇష్టం వచ్చినట్టు కథనాలు సృష్టించింది.

భేటీ  తర్వాత జగన్ చెప్పింది ఒకటైతే మీరు రాసింది మరొకటి. అయితే ఈ విషయంలో జగన్ చెప్పిన దానిపై ఎల్లో మీడియా “అమ్మా జగనా” అంటూ పెద్ద వార్త ప్రచురితం అయ్యింది..వ్యక్తిగత స్వార్ధం కోసమే ప్రధానితో భేటీ అయ్యారు అని తెలిపింది..ఆ విషయంపైనే వైసిపి మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి సదరు సంస్ధ ఎండి పై నాంపల్లి కోర్టులో కేసు వేశారు.

జగన్ పరువుకు భంగం కలిగే విధంగా కథనం ఉందంటూ నాంపల్లి కోర్టులో పరువునష్టం కేసు వేశారు. అయితే హైకోర్టులో ఆళ్ల రామకృష్ణా రెడ్డి వేసిన పిటీషన్ కొట్టేశారు. ఈ క్రమంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీంకోర్టు కి వెళ్లాలనే ఆలోచనలో వున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి  వేసిన పిటిషన్ స్వీకరిస్తే సదరు ఎల్లో మీడియా ఎండి కి చాలా చిక్కులు తీసుకువస్తాయి అని సమాచారం. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ చంద్రబాబు త అంటే తందాన అనే ఈ ఎల్లో మీడియా కు సుప్రీం కోర్టు పిటిషన్ చెమటలు పట్టిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: