ఎమ్మెల్యేలు అంటే నియోజకవర్గ అభివృద్ధికి అందరితో కలిసి మెలసి పనిచేయాల్సి ఉంటుంది. ఎక్కడ తేడా కొట్టినా నియోజకవర్గ అభివృద్ధి అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి  జరగదు. ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం కలిసి మెలిసి పనిచేసి అభివృధి  చేసుకోవాల్సింది పోయి కయ్యానికి కాలు దువ్వుతున్నారు . ఒకే పార్టీలో ఉన్నప్పటికీ అంతర్గత విభేదాలతో పరస్పరం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. టిఆర్ఎస్ లో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు ఈ రెండు నియోజక వర్గాలకు మాత్రమే పరిమితమైన ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. 

 

 

 

 గద్వాల్ ఎమ్మెల్యే అయిన కృష్ణమోహన్ తన అలంపూర్  నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని అబ్రహం ఆరోపిస్తున్నారు. తమ నియోజకవర్గంలో పర్యటిస్తూ  గ్రూపులు క్రియేట్ చేస్తున్నారని మండి పడుతున్నారు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం. కృష్ణ మోహన్ తమ నియోజకవర్గంలో అక్రమ ఇసుక దందా కు పాల్పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కృష్ణమోహన్ వర్గంలోని వారికే టిక్కెట్లు ఇవ్వాలని... లేదంటే  ఇండిపెండెంట్ లను  రంగంలోకి దించుతామంటూ బెదిరిస్తున్నారని  గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ పై అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణమోహన్ తీరు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ  కూడా కృష్ణమోహన్ తన తీరు మార్చుకోవడం లేదు అంటూ మండిపడుతున్నారు అబ్రహం. 

 

 

 

 దళితుడిని అయినందుకే కృష్ణమోహన్ తను అణగదొక్కేందుకు ప్రయత్నాలు జరుపుతున్నాడంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తన నియోజకవర్గ జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ కృష్ణమోహన్ ను  హెచ్చరించారు. తనపై అధిష్టానం  ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అబ్రహం స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో  తెరాస నేతలకే  బరిలో  నిలబెడతా అంటూ తేల్చి చెప్పారు. ఇక వీరిద్దరి ఇద్దరి మాటల యుద్ధం ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా... టిఆర్ఎస్ హైకమాండ్ కు  పెద్ద తలనొప్పిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: