కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఒక అంటార్కిటికా ఖండం తప్ప మిగతా ఖండాలలో ఈ వైరస్ వ్యాపించి ఉంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ మొన్నటివరకు ఇటలీ దేశాన్ని స్మశానంగా మార్చడం జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు అమెరికా మరియు స్పెయిన్ దేశాలలో విచ్చలవిడిగా మరణ తాండవం చేస్తుంది. దీంతో అత్యంత తక్కువ భూభాగం కలిగిన భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటంతో ఏ మాత్రం పరిస్థితి చెయ్యి దాటిన మరణాల సంఖ్య మాత్రం కోట్లల్లో ఉంటుందని ఇక భారతదేశంలో మానవ జాతి మనుగడ డేంజర్ జోన్లో పడినట్లేనని మేధావులు అంటున్నారు. దీంతో ప్రధాని మోడీ పిలుపుమేరకు 21 రోజులపాటు ఓపిక పట్టుకుని ఇంటిలో గడిపితే దేశానికి మంచి చేసిన వాళ్లమవుతాం అదేవిధంగా ఇంటిలోకి మరణాన్ని తీసుకురాకుండా ఇంటి సభ్యులను కాపాడుకున్న వారమవుతాము అని చాలామంది అంటున్నారు.

 

రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి చూస్తే కరోనా వైరస్ లక్షణాలు ఎక్కువగా విదేశాల నుండి వచ్చిన వారికి మాత్రమే ఉండటంతో రెండు ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ వాళ్ల వివరాలను సేకరించే పనిలో పడింది. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..గ్రామ సచివాలయం మరియు వార్డు వాలంటీర్ ల వ్యవస్థ ద్వారా ఇంటింట సర్వే చేపట్టి మొత్తం వివరాలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది.

 

దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది ముఖ్యమంత్రులు జగన్ ఐడియా నే ఫాలో అవటానికి ఏర్పాట్లు రెడీ చేసుకుంటున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా వైరస్ కట్టడి విషయంలో కట్టుదిట్టంగా ఉండటంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అటు తిరిగి ఇటు తిరిగి జగన్ ఐడియా లను ఫాలో అవటానికి ఎక్కువ ముఖ్యమంత్రులు ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: