ఇప్పటి వరకు మనకు అద్దెకు ఇల్లు, వాహనాలు, పొలాలు, చివరకు అద్దెగర్భం వంటివి వాటి గురించి విన్నాం.  కానీ, ఇప్పుడు కొత్తగా మరొకటి తెరమీదకు వచ్చింది.  అదే అద్దెకు తండ్రి ప్రేమ.  అవును ఇది నిజం.  ఈ బిజీ లైఫ్ లో తన పిల్లలకు తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు.  తండ్రితో కలిసి సరదాగా బయటకు వెళ్లాలని, సరదాగా పార్క్ కు వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఉంటుంది.  కానీ, ఇప్పటి తరం తండ్రులకు అంతటి సమయం లేదు.  

ఇంట్లో తినేందుకు సమయం లేదని పరుగులు తీస్తుంటారు.  అలాంటిది పిల్లలను బయటకు తీసుకెళ్లడం అంటే కుదరని పని.  దీంతో పాపం పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు.  ప్రేమంటే ఏంటో తెలియకుండా పెరగడంతో వారు కూడా టైమ్ మెషిన్ లా మారిపోతున్నారు.  చివరకు జీవితంలో ఏం సాధించడం అని చూసుకుంటే ఏమి ఉండదు.  

దీనిని గమనించిన జేమ్స్ అనే వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు.  తండ్రిని అద్దెకు ఇస్తామని ప్రకటించాడు.  సోషల్ మీడియాలో ఓ పేజీ క్రియేట్ చేసి దాని గురించి పోస్టింగ్ చేయడం మొదలుపెట్టాడు.  ఈ ఐడియా చాలా మందికి నచ్చింది.  పిల్లలను బయటకు తీసుకెళ్లాలని ఉంటుంది.  సమయాభావం వలన బయటకు తీసుకెళ్లలేకపోతున్నారు.  దీంతో వారంతా జేమ్స్ ను ఆశ్రయిస్తున్నారు.  అద్దెకు తండ్రులను తీసుకుంటున్నారు.  

తమ పిల్లలకు తండ్రితో గడిపేలా చూస్తున్నారు.  ఇదేమి ఫ్రీ సర్వీస్ కాదు.  గంటకు రూ.300 చొప్పున ఛార్జ్ వసూలు చేస్తున్నాడు.  ఆదివారాల్లో సాయంత్రం 4 తరువాతైతే 20శాతం అదనంగా ఫీజు వసూలు చేస్తారు.  పార్టీలు, బర్త్ డే వేడుకల వంటివి వాటికి తండ్రులు కావాలంటే అధికంగా ఛార్జ్ చెల్లించాల్సి వస్తుంది.  ఈ బిజినెస్ క్లిక్ కావడంతో ఇది వైరల్ గా మారింది.  కొత్తగా ఆలోచించే వారికి ఎప్పుడూ అవకాశాలు వస్తుంటాయి అని చెప్పేందుకు జేమ్స్ జీవితం ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  పైసా ఖర్చు లేకుండా వ్యాపారం స్టార్ట్ చేసి ఈరోజున పదిమందికి ఉపాధి కల్పిస్తూ మంచిగా డబ్బు సంపాదించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: