దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతుంది.. ఢిల్లీ లో వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతుల గురించే..   భారత్ బంద్ కూడా సక్సెస్ కావడంతో యావత్ భారతదేశం నుంచి ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.. కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఉద్యమంలో రైతు బిల్లును వెనక్కి తీసుకోవడమనే ఒకే ఒక్క ఎజెండా తో ముందుకు సాగుతున్నారు రైతులు..  ప్రజల సహాయ సహకారాలతో, పలు రాష్ట్రాల రాజకీయ నాయకుల మద్దతు తో ఈ బంద్ రైతుల మేలు కోసం చేసి విజయవంతం చేశారు.. గత కొన్ని రోజులుగా దేశ నడిబొడ్డున రైతులు మోడీ రైతుల విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే..

అందులో భాగంగా నిన్న భారత్ బంద్ కి పిలుపునివ్వగా ఆ బంద్ ప్రశాంతంగా నిలిచింది.. తెలంగాణ రాష్ట్రంలో టీ ఆర్ ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీలో ఈ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించగా ప్రజలు కూడా సహకరించారు..ఇక ఈ బంద్ తో మోడీకి గతంలో ఎప్పుడు లేని చెడ్డపేరు వచ్చింది అని చెప్పాలి.. దేశంలో ఎప్పటినుంచో ఉన్న పెండింగ్ తీర్పులను ఫలితం వచ్చేలా చేసిన మోడీ వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టిన దగ్గరినుంచి విమర్శల పాలు అవుతున్నారు. సొంత పార్టీ ఎంపీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించగా దేశంలోని డెబ్భై శాతం పార్టీ లు ఈ బిల్లును వద్దని వాదించింది... అయినా మోడీ వినలేదు.. చివరికి ప్రజాగ్రహానికి గురవ్వక తప్పట్లేదు.

 భారత్ బంద్ పిలుపు దేశం నలుములలా ప్రతిధ్వనించడంతో ఉద్యమం విస్తృతమవుతుందనే అభిప్రాయం కూడా బలపడుతోంది. దాంతో ముందుకెళ్లాలా.. లేక వెనక్కి తగ్గాలా అన్నది కమలనాథులు తేల్చుకోవాల్సి వస్తోంది. ప్రధానంగా ఆర్థికంగా, రాజకీయంగా , లాబీయింగ్ పరంగా బలమైన పంజాబీ రైతులతో ముడిపడిన ఉద్యమం మూలంగా పరిస్థితి తీవ్రమయ్యే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. దాంతో కేంద్రమే ఏదో ఒక పరిష్కారం చూడాల్సిన అవసరం ఉందని బీజేపీ కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: