వడ్ల సేకరణ విషయంలో కేంద్రానిది ఘోర వైఫల్యమని పేర్కొన్నారు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.  యాసంగి వడ్ల సేకరణ విషయంలో కేంద్రానికి స్పష్టత లేదని.. యాసంగి వడ్లను బాయిల్డ్ రైస్ కోసం ఇప్పటి వరకు కేంద్రం ప్రోత్సహించి ఇప్పుడు చేతులెత్తేసిందని తెలిపారు.
కేంద్రం బాయిల్డ్ రైస్ కు ప్రోత్సాహం ఇచ్చినందునే దేశంలో ఇన్ని మిల్లులు ఏర్పడ్డాయని.. ఏడేళ్లుగా కేసీఆర్ గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డగోలుగా , సంస్కారహీనంగా మాట్లాడింది , నిందించింది బీజేపీ నేతలు, ఎంపీలు అని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కిషన్ రెడ్డి బెదిరిస్తున్నారు అని సమస్యను పక్కదారి పట్టించడం ఆశ్చర్యకరమనీ.. బీజేపీ బెదిరింపుల విషయం దేశమంతా తెలుసు తెలిపారు.  


బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్వయంగా పలు మార్లు సోషల్  మీడియాలో బీజేపీ ప్రభుత్వ వైఖరి వెల్లడించారని.. ధాన్యం సేకరణ నుండి ఆరు నెలల వరకు కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి నిధులు ఇచ్చే దాకా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని తెలిపారు.  తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొన్న వెంటనే రైతుకు డబ్బులు ఇస్తుంది .. ఆరు నెలల వరకు జరిగే నష్టం, వడ్డీ తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది .. దానిని భరించాలని కేంద్రాన్ని కోరినా చలనం లేదని.. పంజాబ్ మాదిరిగా తెలంగాణ వడ్లు కేంద్రం ఎందుకు కొనదు ? అని నిప్పులు చెరిగారు -వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తే పంజాబ్ వస్తున్న పంట అది .. ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం , తెలంగాణ రైతులు కేంద్రం సహకారం లేకుండా పండిస్తున్న పంటకు చేయూత ఇవ్వరా ?  గతంలో కొనుగోళ్లు మద్యలోకి వచ్చాక కేంద్రం వచ్చే సారి యాసంగి వడ్లు కొనాలని అడగమని లేఖ ఇవ్వాలని కేంద్రం వత్తిడి చేసిందన్నారు.  తెలంగాణలో యాసంగి వడ్లన్నీ బాయిల్డ్ రైస్ కోసమే వేస్తారని.. ఈ విషయం తెలంగాణలో సామాన్య రైతుకు కూడా తెలుసు అని చురకలు అంటించారు.   దేశంలో బియ్యం నిల్వలు పేరుకుపోయాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెబుతారని.. వరి ధాన్యం పండించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెబుతాడు .. వీరి ప్రభుత్వ వైఖరికి విరుద్దంగా చెబుతాడన్నారు. తెలంగాణ రైతుల యాసంగి వడ్లు కొంటరా ? కొనరా ? కేంద్ర మంత్రిగా, తెలంగాణ వాసిగా కిషన్ రెడ్డి చెప్పాలని సవాల్ విసిరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: