అమరావతి రైతులు తిరుపతిలో నిర్వహించ నున్న బహిరంగ సభ పై అటు ప్రభుత్వం నుంచి కానీ,   వారు ఎంచుకున్న సభావేదిక  శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం విషయంలో కానీ ఇంకా క్లారిటీ రాలేదు. కాని యాత్ర నిర్వాహకులు మాత్రం తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేెశారు. ఈ  యాత్ర ముగింపు సభకు ఇటీవల ఢిల్లీలో పోరాటం చేసిన రైతు నాయకులను అహ్వానించారు.

అమరావతి రైతులు చేస్తున్న తిరుపతి యాత్రలో భాగంగా నిర్వహించే బహిరంగ సభకు ఢిల్లీ నుంచి రైతు నాయుకులు వస్తారని నిర్వాహకులు ప్రకటించారు. ప్రస్తుతం వారు చేస్తున్నబుధవారం 38 వ రోజు చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో ఆరంభమైంది. రాజుపాళం, పంగూరు, కాట్రగుంటల మీదుగా  శ్రీ కాళహస్తి పట్టణంలో ప్రవేశించ నుంది. తెలుగు దేశం పార్టీ శ్రేణులు   అమరావతి రైతుల పాదయాత్రకు అన్ని ఏర్పాట్లుచేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు దేశం పార్టీ శ్రేణలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఈ  యాత్రకు సిపిఐ జాతీయ కార్యదర్శి  నారాయణ బుధవారం వద్దతు పలికారు. ఆరోగ్యం సహకరించక పోవడంతో పాటు, ఇటీవల వరదలలో పర్యటిస్తున్న సమయంలో కాలు బెణకడంతో  ఆయన కాలికి కట్టుకట్టుకుని ఉన్నారు. దీంతో నారాయణ  యాత్రలో వస్తున్న వెంకటేశ్వర స్వామి రథం లో కూర్చోని  కొద్ది దూరం ప్రయాణం చేశారు. ప్రజల అభీష్టాలకు అనుగుణంగా ప్రభుత్వాలు, పాలకులు నడుచుకోవాలని నారాయణ తెలిపారు. అమరావతి రాజధాని విషయంలో తమ పార్టీ విధానాన్నితాము ఇప్పటికే బహిర్గతంగా ప్రకటించి ఉన్నామని తెలిపారు అమరావతి రైతు యాత్రలో మరోసారి పాల్గోంటుండటం తనకు ఆనందాన్ని ఇస్తున్నదని సిపిఐ నారాయణ హర్షం వెలిబుచ్చారు. పాదయాత్రకు దేశం నలుమూలల నుంచి రైతు నాయుకులు హాజరవుతారని, తిరుపతిలో నిర్వహించే భారీ భహిరంగ సభ వేదిక పై నుంచి రైతు నేతలు పాలకులకు తమ డిమాండ్ లను వెల్లడిస్తారని, ఢిల్లీ నుంచి పాదయాత్రకు హాజరైన  రైతునాయుకుడు సంజీవ్ చౌదరి పేర్కోన్నారు.
ఇదిలా ఉండగా తమకు పదిహేను, పదహారు తేదీలలో తిరమలలో వేంకటేశ్వర స్వామి  దర్శనం కల్గించాలని రైతులు యాత్రలో పాల్గోంటున్న మహిళలు తిరుల తిరుపతి దేవస్థానం పాలక మండలికి విన్నవించారు.  దాదాపు ఐదు వందల మంది  చాలా దూరం నుంచి పాదయాత్రగా తిరుమలకు వస్తున్నందున తమకు ప్రత్యేక ప్రవేశం ద్వారా దర్శన భాగ్యం కల్పించాలని వేడుకున్నారు.  టిటిడి పాలక మండలి అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డికి ఈ మేరకు లేఖ రాశామని వారు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: