కొత్త సంవత్సరం అంటే పెద్ద నగరాల్లొ పోలీసులకు తల నొప్పిగా మారింది. యువతులు పార్టీల పేరు తో తప్ప తాగి వచ్చి అల్లర్లు చెస్తున్నారని పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.గత రాత్రి మందుబాబులు జంట కూడలిలొ వీరంగం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కేకు కట్టింగ్, పబ్ లు, పార్టీలు అన్నీ కూడా థారాస్తాయికి చేరుకున్నాయి. ఎప్పుడు తాగనట్లు ఫుల్‌గా తాగేశారు మందుబాబులు. న్యూ ఇయర్‌ వేడుకల్లో రచ్చరచ్చ చేశారు. తప్పతాగిన మైకంలో హైదరాబాద్ వీధుల్లో రచ్చ చేసింది.


చాలా ప్రాంతాల్లొ ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. మరికొన్ని చోట్ల ప్రమాదానికి కారణమయ్యారు. తప్పతాగి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో దొరికిపోయారు. హడావుడి చేస్తూ కెమెరాలకు చిక్కారు.అది గమనించిన పోలీసులు వారిని చేజ్ చేసి పట్టుకున్నారు. అలాంటి సమయంలో వాళ్ళు చేసే యాక్షన్‌కు ఆస్కార్‌ ఇచ్చినా తక్కువే అన్నంత రేంజ్‌లో సీన్లు పండించారు. కొందరేమో పబ్బుల వద్ద వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో నానా హంగామా చేశారు. నగరం లోని ప్రముఖ పబ్ ల వద్ద యూత్ వీరంగం సృష్టించారు.


పబ్‌ వద్ద ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకోవడం తో కంట్రోల్ చేయలేని పబ్ సిబ్బంది కామ్ గా ఉండి పోయారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా న్యూఇయర్ సంబరాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంబురాల్లో.. తగ్గేదేలే అన్నట్లు జోష్‌ కొనసాగుతోంది. ప్రజలంతా ఇళ్లకై పరిమితై వేడుకలు జరుపుకుంటున్నారు. భారత సైనికులు కూడా హుషారు ఎత్తించే పాటలతో డ్యాన్స్ లు చేస్తూ హోరెత్తిపోతుంది. కోటి ఆశలు, ఆకాంక్షలతో 2022 నూతన సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు సంబరాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం నుంచే మొదలైన న్యూ ఇయర్‌ ఉత్సాహం అర్ధరాత్రి అయ్యే సరికి అంబరాన్ని తాకింది. మా హెరాల్డ్ తరపునుంచి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు..



మరింత సమాచారం తెలుసుకోండి: