భారత్ లో సుధీర్ఘ రాజకీయ అనుభవం కల్గిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీనే. ఈ విషయం ఎవరూ కాదనలేరు. వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం తన ఉనికి కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతోంది. అయితే రాజకీయపు ఎత్తులు వేయడంలో ఆ పార్టీని మించిన వారు లేరనేది ఎవరూ కాదనలేని నిజం. తాజాగా కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన రాజకీయ పక్షాలను విస్మయానికి గురి చేసింది.అది ఏంటో తేలుసా ?
ఉత్తర ప్రదేశ్ తో సహా ఉత్తారా ఖండ్, పంజాబ్,  గోవా, మణిపూర్ రాష్ట్రాలలో ఎన్నికలను జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయబావుటా ఎగుర వేయడం ద్వారా  దేశంలో తన ఉనికిని కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతోంది. ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార బాధ్యతను,మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధి గారాలపట్టీ ప్రియాంక గాంధీ వద్రా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆమె రాష్ట్రంలో రెండు విడతల ప్రచారాన్ని పూర్తి చేశారు. ఇటవల ఓ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ఆమె అస్వస్తతకు గురయ్యారు. ఆ తరువాత ప్రాచారానికి దూరం అయ్యారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు.  అయినా కూడా పార్ఠీ శ్రేణులతో నిత్యం ఫోన్ లో సంభాషిస్తూ తగు సూచనలు చేస్తున్నాారు. కాంగ్రెస్ పార్టీ అధినేత  రాహుల్ గాంధీ తన వంతు ప్రచారం నిర్వహిస్తున్నారు.
తాజాగా భారత్ లో ఓమిక్రాన్  తన ప్రతాపాన్ని చూపుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇతర పార్టీల నేతలను విస్మయానికి గురు చేసింది. కోవిడ్ -19 కేసుల తాజా పెరుగుదలను ఉటంకిస్తూ, ఉత్తర ప్రదేశ్‌లో ఎటువంటి ర్యాలీలు నిర్వహించబోమని కాంగ్రెస్ ప్రకటించింది . అంతే కాకుండా రాష్ట్రంలో పెద్ద బహిరంగ కార్యక్రమాలను నిర్వహించడం మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ మరియు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను కోరింది. కాంగ్రెస్ పార్టీ మాటలను భారతీయ జనతా పార్టీ ఆలకిస్తుందా ? ఇప్పటికే రెండు విడతల ప్రచారం పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సర్వ సన్నద్ధంగా ఉంది.  తాజాగా అందరిలోనూ కోవిడ్ భయాలున్నాయి. ఎన్నికల ర్యాలీల కారణంగా ఓమిక్రాన్ వ్యాపిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ సమయంలో తాము ఎన్నికల ర్యాలీలను నిర్వహించమని కాంగ్రెస్ ప్రకటంచి అందరి ఓటర్ల మనసు గెల్చుకుంది. అయితే ఈ ఓటర్ల మనోగతం ఎన్నికల వేళ వరకూ ఉంటుందా ? అన్నదే ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: