ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఈటల రాజేందర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆ తర్వాత గన్పార్కు లో తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు రఘునందన్ రావు రాజాసింగ్ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ లో ఉన్నటువంటి నిర్బంధ పాలన నశించాలని  బిజెపి ఎమ్మెల్యేలు కార్యకర్తలు నినాదాలు చేశారు. తర్వాత తెలంగాణ అమరవీరుల స్తూపనికి  బిజెపి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్ నివాళులు అర్పించారు.

ప్రజా సంక్షేమ విధాన పత్రమే గవర్నర్ యొక్క ప్రసంగం అని దీనిపై చర్చించడం ఎమ్మెల్యేగా మా హక్కు అని అన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత నలభై ఏళ్ల నుంచి వస్తున్నటువంటి విధానాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని  మండిపడ్డారు. ఇప్పటి వరకు ఎప్పుడైనా గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సెషన్స్ ప్రారంభము అయ్యాయా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అంతే కాకుండా తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ గారికి ఈ విధంగా అవమానం జరిగితే మా పరిస్థితి ఏంటో మాకు అర్థం అవుతున్నదని ఆయన అన్నారు. మేము మాట్లాడుతుంటే మైకులు కట్ చేసి మరీ అవమానిస్తారు. మరి ఈ సారి అవకాశం ఇస్తారో లేదో అని అనుమానం వ్యక్తం చేశారు.

 తెలంగాణ ఉద్యమ సమయంలో గంటల తరబడి మాట్లాడే అవకాశం మాకు దక్కిందని, ప్రస్తుతం మేము ముగ్గురమే కావచ్చు. కానీ రాబోయే బిజెపి ప్రభుత్వం అని రాష్ట్రంలో నియంతృత్వ దోపిడీ పాలన కొనసాగుతుందని, కనీసం అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోతే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఆయన హెచ్చరించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని, లేకుంటే రేపు మీకు కూడా ఇదే గతి పడుతుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: