
అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు ఏదొరకంగా తన పేరు ప్రతిరోజూ ప్రజల్లో వినపడేలా చేస్తారు...అదే రాజకీయం అంటే..కానీ పవన్ అలా చేయడం లేదు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇదే వరుస..ఎప్పుడు ఫుల్ ఫిల్‌గా మాత్రం రాజకీయాలు చేయలేదు..అలా చేయకపోవడం వల్లే ఇప్పటికీ జనసేన పార్టీ బలోపేతం కాలేదు..అలాంటప్పుడు ఇంకా పార్టీ మంచి విజయం ఎలా సాధిస్తుంది...పవన్ సీఎం ఎలా అవుతారు. ఇవన్నీ జరిగే పనులు కాదు.
జనసేన ఆవిర్భావ సభ తర్వాత పవన్ పూర్తిగా ప్రజల్లోనే ఉంటారని, ఇంకా జనసేన పార్టీని బలోపేతం చేస్తారని అంతా అనుకున్నారు...కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా పవన్ రాజకీయం నడుస్తోంది..ఆయన సభ పెట్టి జగన్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు చేసి, చివరిలో వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చే ప్రసక్తి లేదని చెప్పి, టీడీపీతో పొత్తుకు సిద్ధమని ఒక హింట్ ఇచ్చి..మళ్ళీ రాజకీయాల్లో మాయమైపోయారు.
ఇలా చేయడం వల్ల జనసేన పార్టీకి ఏ మాత్రం ఉపయోగం లేదనే చెప్పొచ్చు...ఇకనుంచైనా పవన్ పూర్తి స్థాయిలో రాజకీయం చేయకపోతే ఉపయోగం ఉండదు. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే జనసేనకు మళ్ళీ ఎక్కువ సీట్లు రావాలి..అలా కాకుండా పొత్తు పెట్టుకున్న సరే ఎక్కువ సీట్లు అడగడానికి ఉండదు...బలం లేకుండా ఎక్కువ సీట్లు అడగడం కూడా ఇబ్బందే.కాబట్టి పవన్ ఇప్పటినుంచైనా ఫుల్ టైమ్ రాజకీయాలు చేస్తే బెటర్ అని చెప్పొచ్చు.