మోదీ ప్రవేశ పెట్టిన పథకాలు అన్నీ ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని అమల్లొకి వచ్చాయి.ఇక పోతే ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా తెరిచేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ ధన్ యోజన కార్యక్రమాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమం ద్వారా నిరుపేదలకు జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాను తెరవడానికి ప్రయత్నించింది కేంద్రం. ఈ ఖాతా ద్వారా చాలా మంది వినియోగదారులు గొప్ప ప్రయోజనాలను పొందుతున్నారు. అంతేకాదు పొదుపు ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఇంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు.



ఈ ఖాతా ద్వారా అదనంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీకు ఫలానా బ్యాంకులో ఖాతా ఉంటే మీరు ఇంటి నుంచి మీ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేసుకోవచ్చో తెలుసుకోండి.ఎస్బీఐలో జన్ ధన్ ఖాతా ఉంటే, మీరు 18004253800 మరియు 1800112211 కస్టమర్ కేర్ నంబర్‌లకు మిస్డ్ కాల్ ఇవ్వాలి. మీరు మీ బ్యాలెన్స్ మరియు చివరి 5 లావాదేవీలను తెలుసుకోవాలనుకుంటే మీ భాషను ఎంచుకుని, 1 నొక్కండి. అదనంగా, స్టేట్ బ్యాంక్ కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 92237 66666కు కాల్ చేయడం ద్వారా తమ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు.



ICICI బ్యాంకులో మీ ఖాతా ఉంటే బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే 9594612612 మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఇది కాకుండా.. ICICI బ్యాంక్ కస్టమర్‌లు IBL అని టైప్ చేసి 9215676766కు SMS పంపడం ద్వారా తమ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు.అదే విధంగా జనధన్ ఖాతా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటే.. ఇక్కడ మీరు మీ కనీస బ్యాలెన్స్‌ని సులభంగా తనిఖీ చేయవచ్చు. దీని కోసం మీరు మిస్డ్ కాల్ 09015135135 ఇవ్వాలి. దీంతో.. మీ బ్యాలెన్స్ సులభంగా చెక్ చేసుకోవచ్చు.అలాగే hdfc బ్యాంక్ కస్టమర్‌లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 18004195959కి కాల్ చేయడం ద్వారా ఖాతా బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు మినీ స్టేట్‌మెంట్ కోసం 18004196969కి కాల్ చేసి కనుక్కోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: