చంద్రబాబు రాజకీయ పరిజ్ఞానం, చతురత గురించి అందరికి తెలిసిందే.. ఒక్కసారి అధికారం కోల్పోతే ఎదో విధంగా వచ్చే సారి మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా అయన ప్రణాళిక వేసుకుంటారు.. ఇప్పుడు బీజేపీ జనసేన లతో ఉన్న కూటమితో చేతులు కలపబోతున్నారట..ఆ రాజకీయంలో భాగమే గా ఇటీవలే అనారోగ్యం తో ఉన్న అమిత్ షా కి ఫోన్ చేసి బీజేపీ కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారట.. ఈనేపథ్యంలో ఒంటరిగా పోటీ ఎరగని టిడిపి రానున్న రోజుల్లో కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో జట్టు కట్టినా ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చు. దీనితో చంద్రబాబు ఏ చెట్టుకు ఆ కొమ్మ అన్న ధోరణి కనిపిస్తుంది. ఎంతైనా చంద్రబాబు చంద్రబాబే..