తిరుపతి లోక్సభ ఉప పోరుపై బీజేపీ పదాధికారుల సమావేశంలో చర్చ జరిగింది. తిరుపతి ఎంపీకి కేంద్ర కేబినెట్లో పదవి వస్తుందని తద్వారా నియోజకవర్గంలో సమగ్రాభివృద్ధి అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నిధులు, ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తాయని బీజేపీ ఎన్నికల ప్రచారం చేయనుంది. వైసీపీ లేదా టీడీపీని గెలిపిస్తే తిరుపతికి ఏం లాభం ఉండదని బీజేపీ అంటోంది. మత మార్పిడులు, ప్రభుత్వ అవినీతిపై ఉప ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది..మరి బీజేపి నిర్ణయం ఎంతవరకు ఫలిస్తుంది అనేది చూడాలి..