పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరాబ్యాంక్, ఇండియన్ బ్యాంకుల్లో విలీనమైన బ్యాంకుల కస్టమర్లు ఈ నెలాఖరులోగా తమ శాఖలను సంప్రదించి మారిన చెక్బుక్లు, పాస్బుక్లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్ కోడ్లు మారిపోయాయి. కొత్త బ్యాంకుల చెక్బుక్లు, పాస్బుక్లు వచ్చే వరకు పాత బ్యాంకుల చెక్బుక్లు, పాస్బుక్లు ఖాతాదారులు తమ వెంట అట్టి పెట్టుకోవాలని సూచిస్తున్నారు.పాత బ్యాంకుల్లో తీసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలతోపాటు, మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ అక్కౌంట్స్, బీమా పాలసీ, ఆదాయం పన్ను ఖాతాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.. అలాగే జూన్ 30 వరకు పాత వాటితో వీటిని తీసుకునేందుకు అవకాశం ఉంది.