వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ విజయసారథిగా ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి అడుగిడిన ఆపార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పట్టును పెంచే పనిలో ఆమె నిమగ్నమైనట్లు వేస్తున్న అడుగులను బట్టి తెలుస్తోంది.ఇందులో భాగమే ఆమె మలిచూపు తెలంగాణ వైపు మల్లింది. తెలంగాణ సెంటిమెంట్ అత్యధికంగా ఉన్న కరీంనగర్ జిల్లాను తొలి ప్రయత్నంలో ఎంచుకోవడం కూడా ఆమె రాజకీయ పరిపక్వతకు నిదర్శనమని విపక్షనేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇలాంటి చోట చేపట్టిన తొలి ప్రయత్నం సఫలమైతే మిగిలిన తెలంగాణ ప్రాంతాల్లో ఇక తిరుగుండదని, ఇక్కడ అడ్డంకులెదురైతే వ్యూహాన్ని మార్చుకోవచ్చని ఆమె ఆలోచనగా కన్పిస్తోంది. ఎంచుకున్న కార్యక్రమం కూడా ఎవరు ఎదురు చెప్పలేని విధంగా ఉండేలా ఆమె వేసిన పక్కా పథకం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రసమితికి మింగుడు పడడం లేదు.చితికిపోయిన చేనేత బతుకుల బాగు కోసం ఆమె సిరిసిల్లలో ఆందోలన కార్యక్రమం చేయనున్నారు. టిఆర్ఎస్ నేతలే గత పదేళ్లుగా ఇక్కడ ప్రజాప్రతినిధులు అయిని వీరి బతుకుల బాగు కోసం కనీసం ఆందోలనలు కూడా చేయలేదు. కేవలం తెలంగాణ నినాదంతో ప్రతిసారి ఓట్లు దండుకుంటున్నారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అన్ని కష్టాలు మాయం చేస్తామనడం తప్ప ఇప్పటికి చేస్తున్నదేమి లేదన్న అభిప్రాయం ఇప్పుడిప్పుడే బలపడుతున్న నేపథ్యంలో విజయమ్మ ఈఅంశం ఎంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా చేనేతల సమస్య ఒక తెలంగాణ ప్రాంతానికి మాత్రమే సంబందించినది కాకపోవడం విజయమ్మ విశిష్ట ఆలోచనకు నిదర్శనం. ఈసమస్య ఆంధ్రా ప్రాంతంలోను ఉంది. అంటే తాను పోరాటం చేస్తున్నది కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి కోసం కాదని,తాను,తమ పార్టీ మొత్తం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారి కోసమే పనిచేస్తుందని కూడా చెప్పడంతో పాటు, తెలంగాణ అనకూల ముద్ర సీమాంధ్రలో పడకుండా చూసుకోవడం విశేషం. ఈకార్యక్రమం ఎంపిక వెనుక ఎన్నో కారణాలున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరంగల్ జిల్లా పరకాలలో పార్టీ అభ్యర్థ కొండాసురేఖ దాదాపు విజయం సాధించిందనే చెప్పవచ్చు.లెక్కింపు చివరి వరకు టిఆర్ఎస్ విజయం ఇక్కడ చెప్పలేని పరిస్థితులు నెలకొనడం తెలంగాణలో టిఆర్ఎస్ కు ఇది తొలిసారి. పైగా టీడీపి,కాంగ్రేస్ లను కాదని వైకాపాను జనం ఆదరించడంతో వైకాపాకు ఆదరన ఉన్నట్టు స్పష్టమైంది. ప్రయత్నిస్తే తెలంగాణలో పాగావేయడం ఖాయం అన్న అభిప్రాయాన్ని ఈఎన్నిక చెప్పినట్లయింది. పరకాల పోటీకి అభ్యంతరం చెప్పని టీఆర్ఎస్ తెలంగాణ ప్రాంతంలోని సమస్యలపై పోరాటాలు చేస్తే అడ్డుచెప్పలేదని కూడా విజయమ్మ ఆలోచన. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీగా అభివర్ణించి అడ్డుకోవాలన్నా ఆ అవకాశం లేదు. దీంతో ఇరకాటంలో పడ్డ టీఆర్ఎస్ ఏమి అనలేక తెలంగాణపై వైఖరి చెప్పాలన్న సాకుతో అడ్డుతగిలే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇది అంతగా పని చేసేలా లేకపోవడంతో టిఆర్ఎస్ లో గుబులు మొదలైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: