‘ఆ ఇద్దరూ’ హైదరాబాద్,జూన్, 04: కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బ తగలింది. ఎన్నికల పోలింగ్ రోజు దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు శాసనభ్యత్వానికి రాజీనామా చేశారు. ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల నాని, బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు ఇద్దరు తమ రాజీనామ లేఖల్ని స్పీకరుకు అందచేశారు. సదరు శాసనసభ్యులు స్వయంగా అసెంబ్లీలో స్పీకరు నాదేండ్ల మనోహర్ను కలిసి తమ రాజీనామ పత్రాలను అందచేశారు. జగన్ కు మద్దతుగా వీరిద్దరు పార్టీ నుంచి బయటకు వచ్చిన సంగతి విధితమే. పార్టీ పెద్దలు వీరిని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించకపోవడమే కాకుండా, పార్టీ వ్యవహారాల ఇంఛార్జి గులాంనబీఅజాద్ రాష్ట్రంలో ఉండగానే శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: