తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో కాలయాపన చేయాలని కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి పలువురు బడానాయకులను కలిసిన సందర్బంతో పాటు సోనియాగాంధితో కూడా కాలయాపన చేయాలని, తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రాష్ట్రం విడిపోరాదనే విషయాన్ని అధిష్టానం వద్ద కోరినట్లుగా తెలుస్తుంది. ఎన్నికల సమయం మరో 16నెలల పాటు ఉండడంతో అప్పటివరకు తెలంగాణపై నాన్చాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మరోసారి చర్చల ప్రక్రియకు అధిష్టానం తెరలేపినట్లుగా స్పష్టమవుతుంది. అఖిలపక్షం అయిపోయిన తర్వాత మరోసారి చర్చలని అధిష్టానం వ్యాఖ్యనించడంతోనే తెలంగాణ వాదులకు నిరాశఎదురైంది. ఎందుకంటే తెలంగాణ విషయంలో నాన్చీవేత దోరణి అవలంబించాలనే విషయంపై అధిష్టానం దృష్టి సారించినట్లుగా అనుమానాలు కలిగాయి. కాగా అందరు ఊహించినట్లుగానే తెలంగాణ వాదులకు మరోసారి నిరాశ ఎదురుకానుంది. ఇప్పట్లో తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే రానున్న ఎన్నికల సమయం నాటికి తెలంగాణలో టిఆర్ఎస్ బలం పుంజుకుంటుందని, కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం ఎదురుకానుందని, దీంతో పాటు సీమాంధ్రలో కూడా వైకాపా గెలుచుకుంటుందని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా అధికారంలోకి రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయని భావించి ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కేంద్రం, రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణపై చర్చించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. కాగా తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కావడంతో రోజుకో విద్యార్థి చొప్పున తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం చేసుకుంటున్నారు. ఇటువంటి సమయంలో ఆత్మహత్యలను నివారించడం కోసం ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: