హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డికి రాష్ర్ట హైకోర్టులో చుక్కెదురైంది. నిజామాబాద్ జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలిచినట్లు కూడా కోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. 2009లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నర్సారెడ్డి గెలిచినట్లు అప్పటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అయితే, ఆ ఎన్నికల్లో తాను టీడీపీ అభ్యర్థి నర్సారెడ్డిపై 9ఓట్ల తేడాతో గెలిచినట్లు కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు నర్సారెడ్డి ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇవ్వగా దీనిపై నర్సారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై రాష్ర్ట హైకోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి 9ఓట్లతో గెలిచినట్లు ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: