2014 రాష్ట్రరాజకీయ క్రీడల్లో విజయం కోసం టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రాక్టీస్ భలే భలే అనుకుంటున్నారు పార్టీ శ్రేణులు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ఈక్రీడలు జరగనున్నాయి. ఎప్పుడు రాష్ట్రం ఒకయూనిట్ గా జరిగేవి, ఇప్పుడు మూడుప్రాంతాలుగా విడిపోయి ప్రజల్లో సైతం ప్రాంతాలవారీగా భావోద్వేగాలు పెరిగిన నేపథ్యంలో జరగనున్నాయి. 2009లోను ఈపరిస్థితి ఉన్నప్పటికి ప్రాంతీయభావాన్ని సొమ్ము చేసుకునేందుకు ఒక టిఆర్ఎస్ మాత్రమే ఉండడం పొత్తుల ఎత్తులతో ఆసమస్యను అదిగమించడం జరిగేది. ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ మాదిరిగా సీమాంధ్రలో ప్రభావం చూపేందుకు మరోబలమైన ప్రాంతీయ పార్టీ రావడంతో టిడిపి చిక్కులు వచ్చిపడ్డాయి.ఆపార్టీ ప్రభావమేంటో ఉపఎన్నికలు రుజువుచేశాయి కూడా.అందుకే అటుఇటు కాకుండా పోతే అడ్రస్ గల్లంతుకావడం ఖాయం. అందుకే తనపై ప్రాంతీయముద్ర పడకుండా జాగ్రత్త పడుతూనే,ప్రాంతీయ భావోద్వేగాలను కూడా సొమ్ముచేసుకునే పనిని ఇరుప్రాంతాల నేతలకు అప్పగించారు. ఇందులో భాగంగా టిటిడిపి నేతలు జైతెలంగాణ అంటుండగా,సీమాంధ్రనేతలు జైసమైక్యాంధ్ర అనడం మొదలుపెట్టారు. టీడీపి నేత బైరెడ్డి ఉన్నంటుండి ఈనినాదంతో తెరపైకి రావడాన్ని ముందుగా ఊహించకున్నా తదనంతరం ఈవిషయంలో చంద్రబాబు మౌనం,ఇవేమి పట్టనట్లుగా ఆయన పనిలో ఆయన నిమగ్నమవుతుండడంతో ఆయన ప్రాక్టీస్ సెషన్ జరుగుతున్న తీరులో ఇది స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు.తాను మాత్రం ఏప్రాంతపు జోలికిపోకుండా అంతట ఓట్లను పొందడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. బిసిల డిక్లరేషన్ పేరుతో వారి మద్దతు పొందేందుకు సభలు,సన్మానాలు ఈసంధర్బంగా వారికి పార్టీటికెట్ల కేటాయింపులో రిజర్వేషన్ తో పాటు అధికారంలోకి వస్తే ఇవ్వనున్న వరాలను కురిపించేసి ఆసంఘాలనేతలను తన దూతలుగా బిసి ఓటర్లవద్దకు వెల్లేందుకు సిద్దంచేశారు. ఆతర్వాత గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్న ఎస్సీలపై దృష్టిపెట్టారు.ఇందులో భాగంగా ముందుగా పార్టీలోని ఎస్సీనేతలతో సమావేశమై ఏంచేస్తే బాగుంటుందనే దానిపై మంతనాలు జరిపి అవి ఇచ్చే పలితాలపై సమీక్ష జరిపారు. ఒకేసారి జనంలోకి వెల్లి ఎడాపెడా హామీలు కురిపిస్తే వాటిని విపక్షాలు కాపీ కొట్టవచ్చు,లేదా తిప్పికొట్టవచ్చు. అదీ కాక అసలు సమయానికి ఇప్పటినుంచే జనంలో తిరిగితే అలసిపోయి కొత్తగా ఏమి చెప్పలేని పరిస్థితి రావచ్చు. రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు ఆలోచనలు, వ్యూహాలు అంత సామాన్యంగా ఉంటాయా మరి.మొత్తం మీద సమీక్షలు,సభలు,సన్మానాలు వంటివాటితో తెగ బిజీ అయ్యారాయన. 

మరింత సమాచారం తెలుసుకోండి: