హైదరాబాద్: జగన్ కుటుంబానికి రాష్ట్ర సర్కార్ తాజాగా మరో షాక్ ఇచ్చింది. వరంగల్-ఖమ్మం జిల్లాలో రక్షణ స్టీల్ కంపెనీకి గతంలో ప్రభుత్వం కేటాయించిన గనుల లీజులను రద్దు చేస్తూ సోమవారం నాడు రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో బ్రదర్ అనిల్ కుమార్ కు చెందిన కంపెనీగా భావిస్తున్న రక్షణ స్టీల్ కంపెనీకి ఖమ్మం జిల్లాలోని బయ్యారం ప్రాంతంతో పాటు వరంగల్ జిల్లాలో ఇనుప ఖనిజ సంపదను తవ్వుకోవడానికి సుమారు 56వేల ఎకరాల భూమిని కేటాయించింది. రక్షణ స్టీల్-ఏపీ ఖనిజాభివ్రుద్ధి సంస్థ కలిపి గనులను తవ్వుకోవడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే, ఈ లీజులలో రక్షణ స్టీల్ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించిందనీ సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చింది. రెవెన్యూ, న్యాయ నిపుణుల నుంచి సర్కార్ ఓ నివేదికను తెప్పించుకున్నట్లు సమాచారం. నిబంధనలకు సంబంధిత కంపెనీ పాటించడం లేదనీ ఓ అంచనాకు వచ్చిన రాష్ర్ట సర్కార్ రక్షణ స్టీల్తో ఏపీ ఖనిజాభివ్రుద్ధి సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: